Advertisementt

బిగ్ బాస్ 6: ఈసారి ఒక్క ఛాన్స్ మాత్రమే

Mon 12th Sep 2022 12:32 PM
bigg boss 6,adireddy,aarohi  బిగ్ బాస్ 6: ఈసారి ఒక్క ఛాన్స్ మాత్రమే
Bigg Boss 6: Only one chance this time బిగ్ బాస్ 6: ఈసారి ఒక్క ఛాన్స్ మాత్రమే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 5 సీజన్స్ ఒక ఎత్తు.. సీజన్ 6 ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది.. బిగ్ బాస్ 6 హౌస్ లో జరిగే మార్పులు. ఎందుకంటే ఎలాంటి వారైనా మొదటి వారమే ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అందులో ఎవరో ఒక కంటెస్టెంట్ అయితే హౌస్ ని వీడాలి. కానీ సీజన్ 6 మొదటి వారం ఏ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చెయ్యలేదు. అలాగే సోమవారం జరగాల్సిన నామినేషన్స్ బుధవారం జరిగాయి. ఇప్పుడు ఈ వారం ప్రతి సీజన్ లాగే.. సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. కానీ ఎప్పటిలా కాకుండా ప్రతి కంటెస్టెంట్ ఒక్కరికే నామినేట్ చెయ్యాలని బిగ్ బాస్ రూల్ పెట్టారు. ప్రతి సీజన్ లో ప్రతి వారం కంటెస్టెంట్స్ కి ఇద్దరిని తగిన కారణాలు చెప్పి నామినేట్ చెయ్యొచ్చు.

కానీ ఈ సీజన్ లో రెండో వారం ఒక్క కంటెస్టెంట్ ఒక్క నామినేషన్ మాత్రమే చెయ్యాలి. అందులో భాగంగా ఆరోహి ఆది రెడ్డిని బాండింగ్ లేని కారణం చెప్పి నామినేట్ చెయ్యగా.. ఆది రెడ్డి గేమ్ ఆడని వాళ్ళని నామినేట్ చేస్తారా.. లేదంటే బాండింగ్ లేదని నామినేట్ చేస్తారా అని అడిగితే.. ఆరోహి ఆడని వాళ్ళని అంది. కానీ మీ ఆట కనిపించలేదు అంది. దానికి ఆది రెడ్డి ఊరుకోలేదు గొడవ పెట్టుకున్నాడు. ఇక నేహా చౌదరి గలాటా గీతుని నామినేట్ చెయ్యగా.. గీతూ కూడా గట్టిగానే గొడవ పెట్టుకుంది. తర్వాత రేవంత్ కీర్తి ని నామినేట్ చేసాడు. వారి మధ్యన గొడవైనట్టుగా లేటెస్ట్ ప్రోమోలో చూపించారు. మరి ఈ రోజు నామినేషన్స్ తో హౌస్ బాగా హీటెక్కినట్టుగా ఈ ప్రక్రియ హాట్ హాట్ గా జరిగినట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తుంది. 

Bigg Boss 6: Only one chance this time:

Bigg Boss 6: Today nominations heat

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ