RC15 లో సూర్య రోల్ రివీల్డ్

Sun 11th Sep 2022 06:11 PM
sj suryah,director shankar,rc15  RC15 లో సూర్య రోల్ రివీల్డ్
SJ Suryah role in RC15 revealed RC15 లో సూర్య రోల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో పని చేసేందుకు ఎంత పెద్ద నటులైన ఎగ్జైట్ అవ్వాల్సిందే. ఆయన కి ఈ మధ్యన హిట్స్ లేకపోయినా.. ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు చాలా ఉత్సాహం చూపుతారు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో RC15, కమల్ హాసన్ తో భారతీయుడు 2 షూటింగ్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ తో పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో RC15 చేస్తున్న శంకర్ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం టాలెంటెడ్ నటుడు ఎస్ జె సూర్య ని తీసుకున్నారు. రెండు రోజుల క్రితమే SJ సూర్యని RC15 ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ పోస్టర్ వదిలిన విషయం తెలిసిందే. 

అయితే శంకర్ తో RC15 ప్రాజెక్ట్ లో పాల్గొంటున్న సూర్య ఆయనతో వర్క్ చెయ్యడం పై ఎగ్జైటింగ్ గా పోస్ట్ పెట్టారు. తాను చిన్నప్పటినుండి అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నపుడు నుంచి శంకర్ గారిని చూస్తున్నానని.. ఒక ఫాన్ గా ఆయన చేసిన విజయ్ స్నేహితుడు మూవీలో చిన్న గెస్ట్ రోల్ చేసినప్పుడు శంకర్ గారి ఎనర్జీ ఎలా ఉందో ఇప్పుడు నేను విలన్ గా చేస్తున్న RC 15 లో కూడా శంకర్ గారి అంతే ఎనర్జీ కనిపిస్తుంది, ఎక్కడా కూడా ఆయన ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఆయనకొక కేక అని చెప్పడమే కాదు, ఒక నటుడుగా శంకర్ గారి అభిమానిగా ఆయన్ని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది అంటూ సూర్య RC15 లో తన రోల్ ని ఇలా ట్వీట్ తో రివీల్ చేసేసారు.

SJ Suryah role in RC15 revealed:

SJ Suryah joins the cast of director Shankar RC15

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ