Advertisementt

బిగ్ బాస్ 6: నాగార్జున సెటైరికల్ కామెంట్స్

Sat 10th Sep 2022 05:52 PM
bigg boss 6,nagarjuna,aadi reddy  బిగ్ బాస్ 6: నాగార్జున సెటైరికల్ కామెంట్స్
Bigg Boss 6: Nagarjuna satirical comments on housemates బిగ్ బాస్ 6: నాగార్జున సెటైరికల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 మొదలై జస్ట్ 6 డేస్ అయ్యింది. ఈ ఐదు రోజులు గొడవలు, టాస్క్ లతో ముగిసిపోయింది. మిస్టర్ కూల్ బాలాదిత్య హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ అవ్వగా.. ఫస్ట్ వరెస్ట్ కంటెండర్ గా గలాటా గీతు నిలిచింది. ఈ రోజు శనివారం.. శనివారమంటే నాగార్జున ఎపిసోడ్స్ వచ్చే రోజు. అలాగే 9 గంటలకే బిగ్ బాస్ స్టార్ మాలో ప్రసారమైపోతుంది. వారం మొత్తం హౌస్ మేట్స్ చేసే తప్పులని వేలెత్తి చూపే రోజు కూడా శనివారమే. అందుకే హౌస్ మేట్స్ మనసులో నాగ్ ఎవరిని తిడతాడో.. తామేం తప్పు చేసామో అని భయపడే రోజు కూడా. కానీ ఈసారి కంటెస్టెంట్స్ మాత్రం చాలా ధీమాగా కనిపిస్తున్నారు. 

తాజాగా నాగార్జున ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. నాగార్జున రావడం రావడమే గలాటా గీతు పై సెటేరికల్ కామెంట్ చేసారు. మా ఇల్లు ఎలా ఉంది అన్నారు నాగ్, మన ఇల్లు అన్నారు అందరూ.. కానీ మన ఇల్లు అంటే గీతూ ఒప్పుకోదు అన్నారు నాగ్. దానితో అట్టాగాదు సర్ అని గీతూ అనబోతుంటే వద్దులే గీతూ నీతో గలాటా ఎందుకు నాకు అన్నారు నాగ్. తర్వాత రేవంత్ నీవు హౌస్ లో భూతులు మాట్లాడుతున్నావ్.. ప్రూఫ్ చూపించాలా అని అడిగారు. ఆ తర్వాత రోహిత్ మెరీనాని పట్టించుకో అంటూ హాగ్ ఇప్పించారు. వాళ్లకి లైసెన్స్ ఉంది అంటూ కామెడీ చేసారు నాగ్.

తరవాత ఓడిపోయిన బాధలో వెనక్కి వచ్చిన ఆరోహికి వచ్చినవెంటనే ఓ మాట అనడం ఆవరసమా.. అని నాగ్ రేవంత్ ని అడిగారు. నీకు సారి చెప్పడానికి ఆరోహి వచ్చింది.. నువ్ వింటున్నావ్ మధ్యలో ఇద్దరు కామంటేటర్స్ వచ్చారు, వాళ్ళకి రివ్యూ లు చేసి చేసి మధ్యలో దూరడం అలవాటు. ఆట ఆడేటప్పుడు ఆటగాళ్లు ఉంటారా.. ఎంపైర్ ఉంటాడా.. అని ఆది రెడ్డిని అడగగా.. దానికి ఆది రెడ్డి ఆటగాళ్లు ఉంటారు అన్నాడు. అంపైర్ గ్రౌండ్ లో ఉండడు కదా అని అనగానే ఆది రెడ్డి ఆలోచిస్తున్న ఫేస్ పెట్టగా అంత ఆలోచించకు అంటూ అదిరెడ్డికి నాగ్ సెటైర్ వేశారు. 

Bigg Boss 6: Nagarjuna satirical comments on housemates:

Bigg Boss 6: Nagarjuna satirical comments on housemates

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ