Advertisementt

పుష్ప ద రూల్ షూట్ అప్ డేట్

Sat 10th Sep 2022 03:00 PM
pushpa the rule,allu arjun,sukumar  పుష్ప ద రూల్ షూట్ అప్ డేట్
Pushpa The Rule shooting update పుష్ప ద రూల్ షూట్ అప్ డేట్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుష్ప ద రూల్ రెగ్యులర్ షూట్ కోసం రెడీ అవుతున్నారు. రీసెంట్ గానే పుష్ప 2 పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. అల్లు అర్జున్ అమెరికాలో ఉన్న కారణముగా ఆయన పూజా ముహూర్తానికి హాజరవలేదు. సుకుమార్ అండ్ టీం పుష్ప పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. ఇక పూజ అయ్యి రోజులు గడుస్తున్నా.. అల్లు అర్జున్ సుకుమార్ లు ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టలేదు. రష్మిక తాజాగా గుడ్ బై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పుష్ప పార్ట్ 2 షూటింగ్ కి సమయం ఆసన్నమైంది అంటూ అప్ డేట్ ఇచ్చింది.  ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ కి సంబందించిన అప్ డేట్ మాత్రం మేకర్స్ ఇవ్వలేదు.

అయితే పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభించేందుకు పుష్ప యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మార్చ్ కల్లా షూటింగ్ ముగించేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకి రెండు నెలలు కేటాయించి.. సమ్మర్ లో పుష్ప ద రూల్ ని ప్రేక్షకుల ముందుకు తేవాలని, లేదూ ప్రమోషన్స్ కి ఇంకా ఎక్కువ టైం తీసుకుని దసరా టార్గెట్ గా దించాలనే ప్లాన్ లో సుక్కు అండ్ టీం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే పార్ట్ కోసం సుకుమార్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవిని సంప్రదిస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Pushpa The Rule shooting update:

Pushpa The Rule shooting update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ