Advertisementt

రాజమౌళికి ఇదంతా అవసరమా..

Fri 09th Sep 2022 10:25 PM
ss rajamouli,ranbir kapoor,brahmastra  రాజమౌళికి ఇదంతా అవసరమా..
Does Rajamouli need all this? రాజమౌళికి ఇదంతా అవసరమా..
Advertisement
Ads by CJ

రాజమౌళి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్. ఆయన సినిమా చేస్తే అది సూపర్ హిట్టే. అందుకే రాజమౌళి సినిమాలు వస్తున్నాయంటే పాన్ ఇండియా ప్రేక్షకులు అలెర్ట్ అవుతారు, తెలుగు ప్రేక్షకులు చొక్కాలు చించేసుకుంటారు. రాజమౌళి బాహుబలితో ప్రాంచానికి సత్తా చాటారు. ట్రిపుల్ ఆర్ తో అదరహో అనిపించారు. కానీ ఇప్పుడు రాజమౌళి చేసిన ఓ పని ఆయన ఫాన్స్ కి అస్సలు నచ్చడం లేదు. అదే రాజమౌళి బ్రహ్మాస్త్ర ని నెత్తిన వేసుకుని ప్రమోషన్స్ కి తిరగడం.. ఆయన ముఖర్జీ ఓ సినిమా పిచ్చోడు, నాకు లాగే, బ్రహ్మాస్త్ర కథ చూసాక నాకు నమ్మకం వచ్చింది అని అందుకే సినిమాని సమర్పిస్తున్నాను అంటూ ప్రతి ప్రమోషన్స్ లోను రాజమౌళి చెప్పడంతో తెలుగు ప్రేక్షకులకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలోనూ బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర హాష్ టాగ్ హడావిడిలోనూ రాజమౌళిని నమ్మే చాలామంది బ్రహ్మాస్త్రకి క్యూ కట్టారనడంలో నిజం ఉంది.

కానీ బ్రహ్మాస్త్ర టాక్, రివ్యూస్ చూసాక రాజమౌళి గారు ఇదంతా మీకు ఆవరసమా అంటున్నారు. బ్రహ్మాస్త్ర కథ గందరగోళం గా ఉంది అని, రాజమౌళి బ్రహ్మాస్త్ర విఎఫెక్స్ చూసి పడిపోయారు. అవి సినిమాలో హై స్టాండెడ్స్ లో ఉన్నాయి. రణబీర్ కపూర్, అలియా భట్ పెరఫార్మెన్స్ అదిరిపోయాయి. కానీ హీరో, హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ ట్రాక్‌, పాట‌లు మాత్రం చాలా బోరింగ్‌, క్లైమాక్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు, ద‌ర్శ‌కుడు అయాన్ అనుకున్న పాయింట్ మంచిదే. కానీ ఆయన క‌థ‌ను న‌డిపించిన తీరు ఆక‌ట్టుకోలేదు. క‌థ‌లో మంచి ఎమోష‌న్స్ లేవు. ఉన్నాప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అవ‌వు. బ్రహ్మాస్త్రలో ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ చేసే సోల్ మిస్ అయ్యింది. ఇలాంటి సినిమాని రాజమౌళి ప్రమోషన్స్ చేసి పరువు పోగొట్టుకున్నారు. తర్వాత ఆయన్నుండి వచ్చే సినిమాపై ఎవరికీ గుడ్డి నమ్మకం ఉండదు. ఆలోచించే చూస్తారు అంటూ ఆయన ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Does Rajamouli need all this?:

SS Rajamouli to present South versions of Ranbir Kapoor Brahmastra

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ