Advertisement

మహేష్ vs విజయ్ సోషల్ మీడియా వార్

Mon 05th Sep 2022 10:10 PM
mahesh,vijay,mahesh vs vijay  మహేష్ vs విజయ్ సోషల్ మీడియా వార్
Mahesh vs Vijay: fans war మహేష్ vs విజయ్ సోషల్ మీడియా వార్
Advertisement

కొన్నాళ్లుగా అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తెలుగు హీరోల ఫాన్స్ మాత్రమే కాదు, అరవతంబిలు కూడా తమ ఫెవరెట్ హీరోని ఎవరేమన్నా శృతి మించిపోతారు. అక్కడ కోలీవుడ్ లో తమిళ తంబీలు అజిత్ vs విజయ్ ఫాన్స్ గా విడిపోయి కొట్టుకుని చస్తారు. అసలు హీరోలు కామ్ గా సైలెంట్ గా తమ పని తాము చేసుకుపోతారు. కానీ అభిమానులకే ఈగో, అహం. అందుకే సోషల్ మీడియాలో, పోస్టర్స్ వార్ అంటూ హంగామా సృష్టిస్తారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, తలపతి విజయ్ ఇద్దరూ కాంట్రవర్సీలకి దూరంగా ఉండే హీరోలు. సినిమాల విషయంలో ఎలా ఉన్నా.. పర్సనల్ గా వారు వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు విషయం ఏమి లేకుండానే మహేష్ ఫాన్స్ విజయ్ ఫాన్స్ సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు. 

నోటితో చెప్పలేని హాష్ టాగ్స్ తో ఇద్దరి హీరోల ఫాన్స్ పచ్చి భూతులు ట్రెండ్ చేస్తూ గీత దాటేసారు. #MyDearThalapathyVijay, #ClownMaheshBabuFans, #BoycottGayVijayFromIFI, #NationalTrollMaterialVijay, #BoycottLesbianVijay అంటూ మహేష్ ఫాన్స్ రెచ్చిపోయి విజయ్ ని తిట్టిపోస్తున్నారు. #BoycottGayMahesh అంటూ విజయ్ ఫాన్స్ మహేష్ ని తిడుతున్నారు. మరి అభిమానులు ఇలా హద్దు మీరు ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో చేసే ఈ పిచ్చి చేష్టలకి మహేష్-విజయ్ ఏం సంధానం చెబుతారో అని కొందరంటుంటే.. ఫాన్స్ పిచ్చి పరాకాష్టకు చేరింది.. మహేష్-విజయ్ మాత్రం ఏం చేస్తారు.. కామ్ గా ఉంటే ఆ గొడవ అదే సద్దుమణుగుతుంది అనుకుని సైలెంట్ గానే ఉంటారు తప్ప ఫాన్స్ ని మందలించరు అంటున్నారు కొంతమంది నెటిజెన్స్. 

Mahesh vs Vijay: fans war:

Mahesh fans vs Vijay fans: Social Media war

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement