Advertisementt

మంగళ వారం మరింత నీరసంగా లైగర్

Wed 31st Aug 2022 06:32 PM
liger,liger box office collection,vijay deverakonda  మంగళ వారం మరింత నీరసంగా లైగర్
Vijay Deverakonda, Ananya Pandey Liger gets disastrous collections మంగళ వారం మరింత నీరసంగా లైగర్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ గత గురువారం విడుదలై డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో క్లైమాక్స్, అలాగే కొన్ని సన్నివేశాలు మాత్రమే బాలేదు అని, కానీ లైగర్ అంతా బాగానే ఉన్నప్పటికీ.. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ పై నెగెటివిటి, అతను చేసిన ఓవరేక్షన్స్, ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న గడ్డు పరిస్థితి అన్ని కలిసి లైగర్ ని అట్టర్ ప్లాప్ లిస్ట్ లోకి తీసుకెళ్లాయని కామన్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. లైగర్ లో కంటెంట్ లేకపోవడం అన్నిటికన్నా పెద్ద మైనస్. అందుకే లైగర్ ముచ్చట మూడు రోజులు కూడా లేకుండా పోయింది. విజయ్ దేవరకొండ పిఆర్ టీం మాత్రం విజయ్ దేవరకొండని చూసే ఆ మాత్రం కలెక్షన్స్ అన్నా వచ్చాయంటూ న్యూస్ లు స్ప్రెడ్ చేస్తున్నారు. 

అయితే లైగర్ వీకెండ్ పెరఫార్మెన్స్ ఎంత వీక్ గా ఉందో.. వీక్ డే సోమవారం లైగర్ మరింతగా నీరసపడిపోయింది. సోమవారం కన్నా మంగళవారం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక్క కోటి కూడా కలెక్ట్ చెయ్యలేకపోయింది. కొన్నిచోట్ల ఆక్యుపెన్సీ లేక షోస్ నిలిపేశారు. నైజాం లాంటి ఏరియాల్లో కేవలం రెండు లక్షలు వస్తే.. సీడెడ్, ఉత్తరాంధ్రలలో ఒక్క లక్ష తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అటు ఓవర్సీస్ లోను లైగర్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఇక పూరి మాత్రం లైగర్ ఫలితం విషయంలో కామ్ గా ఉండే.. విజయ్ దేవరకొండ మొన్న ఇండియా-పాక్ మ్యాచ్ లో హడావిడి చేసి వచ్చాడు. ఛార్మి అయితే కళ్ళ నీళ్లు పెట్టేసుకుంటుంది.

Vijay Deverakonda, Ananya Pandey Liger gets disastrous collections:

Liger box office collection Day 6

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ