Advertisementt

లైగర్ ఓటిటి పార్ట్నర్ రివీల్డ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Sat 27th Aug 2022 02:22 PM
liger movie,liger ott,vijay deverakonda  లైగర్ ఓటిటి పార్ట్నర్ రివీల్డ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Liger OTT partner revealed లైగర్ ఓటిటి పార్ట్నర్ రివీల్డ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఈ గురువారమే విడుదలయ్యింది. భారీ అంచనాలతో విపరీతమైన క్రేజ్ తో విడుదలైన లైగర్ మూవీకి ఆడియన్స్, క్రిటిక్స్ అంతా ప్లాప్ టాక్ ఇచ్చారు. సినిమా అస్సలు బాలేదు అంటూ ఓపెన్ గానే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా కలెక్షన్స్ కళకళలాడినా.. ప్రస్తుతం అయితే లైగర్ కలెక్షన్స్ డల్ గా కనిపిస్తున్నాయి. ఇక లైగర్ ని ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు అంటే అన్ని భాషలకి కలిపి 85 కోట్లకు దక్కించుకుంది అని సమాచారం. 

సినిమా రిలీజ్ కి ముందే లైగర్ ఓటిటి డీల్ ఫైనల్ అయ్యింది. ఇక సినిమా హాట్ స్టార్ లో ఎప్పుడు ప్రసారం అవుతుందో అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. కారణం సినిమా హిట్ అయితే ఎనిమిది వారాల తర్వాతే ఓటిటిలోకి వచ్చేది అనే నిర్ణయాలు జరిగాయి. కానీ ఇప్పుడు ప్లాప్ అయ్యింది. మరి ఎనిమిది వారాల కన్నా ముందే ఓటిటిలో రిలీజ్ చేస్తారా.. లేదంటే అనేది తెలియాల్సి ఉండగా.. ప్రస్తుతం ఓటిటీల విషయంలో ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఓ 50 రోజుల తర్వాతే అంటే అక్టోబర్ రెండు, మూడు వారాల్లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

Liger OTT partner revealed:

Liger Release Date On OTT Revealed!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ