Advertisementt

ఒకేసారి మూడు అంటున్న ప్రభాస్

Fri 26th Aug 2022 09:07 PM
prabhas,maruthi,salaar,project k  ఒకేసారి మూడు అంటున్న ప్రభాస్
Prabhas says three movies at a time ఒకేసారి మూడు అంటున్న ప్రభాస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఫాన్స్ కి ప్రభాస్ షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే ఉన్నారు. ఎప్పుడూ స్లో గా సినిమాలు చేసే ప్రభాస్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల సెట్స్ మీద తిరుగుతున్నారు. అవి కూడా పాన్ ఇండియా మూవీస్ అవడంతో ప్రభాస్ ఫాన్స్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. సలార్ లో మాస్ గా, ప్రాజెక్ట్ కే లో క్లాస్ గా ప్రభాస్ కనిపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే షూటింగ్స్ ని ఒకేసారి చేస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ తో కష్టపడుతున్న ప్రభాస్ ఇప్పుడు మూడో సినిమా కూడా మొదలు పెట్టేసారు. అదే మారుతి మూవీ.

ఇప్పుడు ప్రభాస్ మూడు సినిమాల షూటింగ్స్ ని ఒకేసారి చెయ్యబోతున్నారు. అంటే సలార్ మాస్ మూవీ, ప్రాజెక్ట్ కె క్లాస్ మూవీ, ఇప్పుడు మారుతి తో కామెడీ మూవీ.. ఇలా ప్రభాస్ మూడు రకాల గెటాప్స్ తో మూడు సినిమాల సెట్స్ కి తిరుగుతూ అలసిపోతారన్నమాట. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో మోకాలి ఆపరేషన్ చేయించుకునే పనిలో ఉన్నారు. ఆయన రాగానే సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి మూవీ అంటూ పరుగులు పెట్టాల్సిందే. అయితే మారుతి -ప్రభాస్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ లో మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన ఫాన్స్ మాత్రం ప్రభాస్ ఇంత త్వరగా సినిమాలు చెయ్యడం, ఏడాది కి రెండు సినిమాలతో అలరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Prabhas says three movies at a time:

Prabhas film with director Maruthi to go on floors this November

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ