Advertisement

షాకింగ్: రామ్ డైరెక్టర్ కి జైలు శిక్ష

Tue 23rd Aug 2022 12:04 PM
the warrior,director lingusamy,cheque bounce case  షాకింగ్: రామ్ డైరెక్టర్ కి జైలు శిక్ష
Director Lingusamy gets 6 months jail షాకింగ్: రామ్ డైరెక్టర్ కి జైలు శిక్ష
Advertisement

ఈమధ్యనే రామ్ పోతినేని తో ద వారియర్ అంటూ డిసాస్టర్ మూవీ చేసిన కోలీవుడ్  డైరెక్టర్ లింగుసామి చెక్ బౌన్స్ కేసులో చట్ట పరమైన ఇబ్బందుల్లో పడ్డారు. ఆవారా, పందెం కోడి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ దర్శకుడు కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. బన్నీ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాకా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఫైనల్ గా రామ్ తో ద వారియర్ మూవీ చేసి తెలుగు, తమిళ్ లో రెండు చోట్లా ప్రూవ్ చేసుకోవాలనుకున్న లింగుస్వామికి వారియర్ షాకివ్వగా.. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు ఇబ్బందుల్లోకి నెట్టింది. తాను గతంలో కార్తీ - సమంత జంటగా యెన్ని ఏలు నాల్ సినిమాని తెరకెక్కించడానికి లింగుస్వామి తన హోమ్ ప్రొడక్షన్ తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ లోనే ప్లాన్ చేసుకుని ఫైనాన్స్ కోసం పీవీపీ ఫైనాన్స్ కంపెనీ నుండి 1.35 కోట్లు అప్పుగా తీసుకున్నాడట. 

ఆ తర్వాత కొన్నాళ్ళకి లింగుసామి 35 లక్షలు చెక్ ని పీవీపీ ఫైనాన్స్ కి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందట. దానితో సదరు ఫైనాన్స్ కంపెనీ.. లింగుసామిపై కోర్టులో కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన అనంతరం కోర్టు లింగుసామికి 6 నెలల జైలు శిక్షను విధించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పీవీపీ ఫైనాన్స్ ఇవ్వాల్సిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశాలు కూడా అందడంతో లింగుసామి.. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టుకు వెళ్లినట్లుగా తెలుస్తుంది.

Director Lingusamy gets 6 months jail:

The Warrior director Lingusamy gets 6 months jail sentence in cheque bounce case

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement