Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nayanthara, Vignesh Shivan in Spain for vacation

స్పెయిన్ లో హొయలు పోతున్న నయన్

Nayanthara, Vignesh Shivan in Spain for vacation

నయనతార విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న తర్వాత రెండు నెలలో రెండుసార్లు హనీమూన్ కి వెళ్ళింది. జూన్ 9 న వివాహం చేసుకున్న ఈ జంట ఆ తర్వాత దైవ దర్శనంలో మునిగిపోయింది. ఇక పెళ్లి తర్వాత బ్యాంకాక్ కి హనీమూన్ ట్రిప్ వేసిన విగ్నేష్ శివన్ - నయనతార అక్కడ తామెంత హ్యాపీ గా ఉన్నమో అనేది ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే నయనతార పెళ్లి తర్వాత హనీమూన్ కి వెళ్లి మోడ్రెన్ గా కనిపించినా.. తాళి విషయంలో మాత్రం సాంప్రదాయబద్దంగా కనిపించింది. స్టిల్ సెకండ్ హనీమూన్ లోను నయనతార మేడలో తాళి కనిపించడం చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. 

భర్త విగ్నేష్ శివన్ తో కలిసి నయనతార మరోసారి హనీమూన్ ట్రిప్ వేసింది. అది కూడా తమకు ఎంతో ఇష్టమైన స్పెయిన్ కి వెళ్లారు. ఫ్లైట్ లోనే రొమాంటిక్ ఫోజులతో రెచ్చిపోయిన ఈ జంట స్పెయిన్ వీధుల్లో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పిక్ ని విగ్నేష్ శివన్ తీసాడు. నయన్ తో సెల్ఫీ టైం అన్నట్టుగా ఈ జంట ఆ ఫొటోస్ లో క్యూట్ గా కనిపించింది. నయనతార ఈ ట్రిప్ లో టూ మోడరన్ గా కనిపించగా.. అక్కడ కూడా నయనతార మెడలో తాళి కనిపించింది. చిట్టిపొట్టి డ్రెస్సులతో నయనతార హాట్ గా కనిపించడమే కాదు భర్త తో ఎంత సంతోషంగా ఉందొ ఆమె మొహం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. 

Nayanthara Turns Photographer For Hubby Vignesh Shivan

nayanthara
vignesh shivan
spain