Advertisementt

లీకెడ్ పిక్ తో రచ్చ స్టార్ట్

Fri 05th Aug 2022 10:35 AM
godfather,chiru,salman khan,mohan raja  లీకెడ్ పిక్ తో రచ్చ స్టార్ట్
Godfather: Chiru, Salman leaked snap creates a sensation లీకెడ్ పిక్ తో రచ్చ స్టార్ట్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కలిసి ఫోటో దిగితేనే సోషల్ మీడియాని షేక్ చేసే ఫాన్స్.. వీరిద్దరూ కలిసి నటిస్తున్న గాడ్ ఫాదర్ నుండి ఏవైనా పిక్స్ లీకైతే ఆగుతారా.. అస్సలూరుకోరు. రీసెంట్ గానే గాడ్ ఫాదర్ నుండి చిరు - సల్మాన్ ఖాన్ ల సీన్స్ పిక్ లీకై సన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. తాజాగా లీకైన పిక్ సినిమాపై మరింత హైప్ ని పెంచేసింది. గాడ్ ఫాదర్ మూవీలో చిరు కి బాడీ గార్డ్ గా సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

చిరు డాన్ గా, పొలిటికల్ లీడర్ గా గాడ్ ఫాదర్ లుక్ లో ఇరగదీస్తున్నారు. ఆయనకి సల్మాన్ బాడీ గార్డ్ గా కాపాడడానికి ఎంతకైనా తెగించే వ్యక్తిగా కనిపించనున్నారు. అయితే చిరు కి సల్మాన్ కి మధ్యలో ప్రభుదేవా కొరియోగ్రఫీలో అదిరిపోయే ఓ ఐటెం కూడా చేసారు. తాజాగా చిరు ని కాపాడడానికి సల్మాన్ చేతిలో గన్ తో యాక్షన్ చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో లీక్ అవ్వగా.. ఆ పిక్ ని మెగా ఫాన్స్ వైరల్ చేస్తూ రచ్చ మొదలు పెట్టారు. గాడ్ ఫాదర్ గా చిరు బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక గాడ్ ఫాదర్ ని దసరా ఫెస్టివల్ కి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇంకా ఈ సినిమాలో నయనతార చిరు కి సిస్టర్ గా కనిపించబోతున్నాడు.

Godfather: Chiru, Salman leaked snap creates a sensation:

Godfather: Chiru, Salman guns blazing

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ