Advertisementt

ఎన్టీఆర్ తో సినిమా నా డ్రీమ్

Wed 03rd Aug 2022 10:39 AM
janhvi kapoor,jr ntr,ntr,prashanth neel  ఎన్టీఆర్ తో సినిమా నా డ్రీమ్
Janhvi Kapoor opens up about chance to work with Jr NTR ఎన్టీఆర్ తో సినిమా నా డ్రీమ్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ కుర్ర హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. కారణం ఆమె వేసే గ్లామరస్  డ్రెస్ లతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. కాగా తమిళంలో నయనతార సూపర్ హిట్ ఫిలిం కో కో కోకిల మూవీని జాన్వీ కపూర్ హీరోయిన్ గా హిందీలో గుడ్ లక్ జెర్రీ పేరుతో రీమేక్ చేసారు. ఆ సినిమా రీసెంట్ గా ఓటీటీలో విడుదలై జాన్వీ నటనకు మంచి మార్కులనే తెచ్చిపెడుతోంది. . ఇక ఫ్యాషన్ షోస్ కి, వెడ్డింగ్ పార్టీ, బర్త్ డే పార్టీలకు అందాలు ఆరబోసే గ్లామర్ షోస్ తో అందరిని తన వైపు తిప్పుకునే జాన్వీ కపూర్ టాలీవుడ్ నుండి వస్తున్న ఆఫర్స్ ని ఒప్పుకోవడం లేదు అనే టాక్ ఉంది. 

ఇక గుడ్ లక్ జెర్రీ ప్రమోషన్స్ లో  జాన్వీ ని షారుఖ్, అమీర్, సల్మాన్ ఖాన్ లతో సినిమాలు చేస్తారా అని అడగగా.. చెయ్యను అని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఎందుకంటే  వాళ్ళ ఏజ్ కి తన ఏజ్ కి మ్యాచ్ కాదు, మేము కలిసి సినిమా చేస్తే వర్కౌట్ అవ్వదు అని చెప్పిన జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించాలనేది తన డ్రీం గా చెప్పుకొచ్చింది. మరి ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చెయ్యబోయే మూవీ కోసం జాన్వీ కపూర్ ని సంప్రదిస్తున్నారనే న్యూస్ ప్రచారంలో ఉన్న టైం లో జాన్వీ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడం తన కలగా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 

Janhvi Kapoor opens up about chance to work with Jr NTR:

Janhvi Kapoor on Jr NTR

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ