ఓ మై గాడ్: పుష్ప ని మించి మేకోవర్
Allu Arjun new braided look from a brand new adఅల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నప్పుడు ఆయన లుక్ లీకవ్వగా.. ఆ లుక్ చూసిన అల్లు ఫాన్స్ ఊగిపోయారు. రఫ్ గా గెడ్డం పెంచేసి, హెయిర్ బాగా పెంచి.. మాస్ కాదు ఊర మాస్ అవతార్ లో ఎర్ర చందనం కూలి నుండి సిండికేట్ ని శాసించే స్థాయికి ఎదిగిన పుష్ప రాజ్ లుక్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనేలా పుష్ప హిట్ లో అల్లు అర్జున్ కేరెక్టర్ హైలెట్ అయ్యింది. అయితే ఇప్పటికీ అల్లు అర్జున్ పుష్ప మేకోవర్ లోనే ఉన్నారు. అదే హెయిర్ స్టయిల్, అదే గెడ్డం ని ఫాలో అవుతున్నారు.
కానీ అల్లు అర్జున్ ఇప్పుడొక యాడ్ షూట్ లో పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ యాడ్ షూట్ చేస్తున్నారు. పైప్స్ కి సంబందించిన యాడ్ అది. అయితే అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ లోనే కనిపిస్తారు అనుకుంటే.. అంతకు మించిన మేకోవర్ లో అద్భుతః అనిపించారు. చెవికి పోగులు, చేతికి రింగులు, నోటిలో చుట్ట.. మేడలో గొలుసు, హెయిర్ కి అక్కడక్కడా తెల్లని కలర్, చిన్నగా మెరిసిన గెడ్డం, హెయిర్ లాగి పెట్టి జడ వేసిన గెటప్ లో అల్లు అర్జున్ లుక్ చూసిన అల్లు ఫాన్స్ ఆగడం లేదు. ఆ పిక్ ని అలా వదిలారో లేదో.. ఇలా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. నిజంగా అల్లు అర్జున్ లుక్ ఆయన ఫాన్స్ కే కాదు.. మూవీ లవర్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంది.
Allu Arjun new braided look from a brand new ad campaign Astral Pipes directed by Harish Shankar






































