దుల్కర్ సల్మాన్ - మృణాళిని ఠాకూర్ జంటగా రష్మిక మందన్న ప్రధాన పాత్రలో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం సీతా రామం. స్వచ్ఛమైన ప్రేమ కథ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో నిర్వహించారు. దుల్కర్, హీరోయిన్స్ రష్మిక, మృణాళిని ఠాకూర్, హను రాఘవపూడి, అశ్విని దత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఇరవై ఏళ్ల క్రితం లెఫ్ట్‌నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి అంటూ అఫ్రిన్ (రష్మిక)కి ఆ ఉత్తరం బాధ్యతని అప్పగిస్తారు. కానీ రశ్మికకి మాత్రం సీతకి లేఖని అందజెయ్యడంలో అడుగడుగునా అడ్డంకులే. సీతామహాలక్ష్మి అనే పేరుతో.. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎవ్వరూ లేరు, పేరే వినలేదు అంటూ ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఎదురవుతాయి.
కానీ పది రోజుల్లో సీత కి లేఖని అందజేయాలని అంటుంది రష్మిక. 1965 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ లో దుల్కర్ సల్మాన్ సోల్జర్ గా అందగా కనిపించాడు. అప్పటి కాలాన్ని ప్రతిభింబించేలా ఆ యుద్ద వాతావరణం, అలాగే సెట్స్, మృణాళిని ఠాకూర్ లుక్స్ ఉన్నాయి. నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే - కాశ్మీర్‌ని మంచుకొదిలేసి వస్తారా.. అనే మృణాళిని చెప్పిన డైలాగ్, దుల్కర్ - మృణాళిని కెమిస్ట్రీ, రష్మిక లుక్స్, తరుణ్ భాస్కర్, భూమిక, వెన్నెల కిశోరె, ప్రకాష్ రాజ్ అందరూ కథకు బలం గా కనిపిస్తున్నారు. ఇక మంచు కొండల మధ్యన అందమైన ప్రేమ కావ్యంగా సీత రామం ఉండబోతుంది అని ట్రైలర్ లో చూపించారు.
టెక్నీకల్ గా PS వినోద్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా కనిపించగా.. విశాల్ చంద్రశేఖర్ రీ-రికార్డింగ్ వర్క్ బావుంది. వైజయంతీ మూవీస్ మరియు స్వప్న సినిమా నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తున్నాయి ట్రైలర్ లో.