Advertisementt

ముందుకు జరిగిన ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్?

Sat 23rd Jul 2022 12:23 PM
prabhas,maruti,prabhas - maruti movie update,salaar,project k  ముందుకు జరిగిన ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్?
Prabhas - Maruti movie update ముందుకు జరిగిన ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్?
Advertisement
Ads by CJ

మారుతి పక్కా కమర్షియల్ కి వచ్చిన టాక్ చూసిన ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ ని మారుతి తో సినిమా కి దూరంగా ఉండమని అడుగుతున్నారు. మారుతి తో మొదటి నుండి ప్రభాస్ సినిమా చెయ్యడం ఇష్టం లేని ప్రభాస్ ఫాన్స్ కి పక్కా కమర్షియల్ టాక్ మరింతగా భయపెట్టింది. ఈ క్రమంలోనే మారుతి -ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోతుంది అనుకున్నారు. మారుతి-ప్రభాస్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ లో మొదలవుతుంది అని మొదట్లో అన్నారు. రాజా డీలక్స్ పేరుతొ మారుతి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే మొదట్లో సెప్టెంబర్ లో అన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగష్టు నుండే మొదలు కాబోతుంది అంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్ -ప్రాజెక్ట్ కే షూటింగ్స్ చేస్తున్నారు. అయినప్పటికీ మారుతి సినిమాని మొదలు పెట్టి త్వరగా ఫినిష్ చేసే యోచనలో ప్రభాస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 

భారీ బడ్జెట్ చిత్రం కాకపోయినా.. మారుతి తన స్టయిల్లో ప్రభాస్ ని చూపించబోతున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తారని, మారుతి ఇండోర్ లో వేసిన ఓ ఇంటి సెట్ లో సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ చేయబోతున్నారని టాక్ ఉంది. ఇక ఆగష్టు నుండి మొదలు కాబోయే మారుతి-ప్రభాస్ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ లోనే ప్రభాస్ సెట్స్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. ఓ పది రోజుల పాటు ఈ ఫస్ట్ షెడ్యూల్ ని మారుతి ప్లాన్ చేసాడట. సలార్, ప్రాజెక్టు K సినిమాలు పూర్తయ్యేలోగా రాజా డీలక్స్ ను కూడా పూర్తిచేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Prabhas - Maruti movie update:

Prabhas - Maruti movie new update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ