Advertisementt

హైపర్ ఆదికి అదిరిపోయే ప్రశ్నలు

Thu 21st Jul 2022 09:26 PM
aadi,hyper aadi,jabardasth,akka bavekkada,sridevi drama company  హైపర్ ఆదికి అదిరిపోయే ప్రశ్నలు
Sridevi Drama Company latest promo viral హైపర్ ఆదికి అదిరిపోయే ప్రశ్నలు
Advertisement
Ads by CJ

ఈమధ్యన జబర్దస్త్ కమెడియన్స్, అక్కడ మానేసి పక్క ఛానల్ కి జంప్ అయిన కమెడియన్స్ యూట్యూబ్ ఛానల్స్ కి మేతగా మారారు, జబర్దస్త్ లోని లుకలుకలు రోడ్డు కీడ్చిన ఆర్పీ, ఆర్పీ కి కౌంటర్ ఇవ్వడానికి దిగిన జబర్దస్త్ బ్యాచ్ ఇలా గత పది రోజులుగా యూట్యూబ్ ఛానల్స్ వెంటే తిరుగుతున్నారు. టాప్ కమెడియన్స్ ఆది, రామ్ ప్రసాద్ కూడా ఈ మేటర్ లో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే తాజాగా ఆది ని శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై అభిమానులు అదిరిపోయే ప్రశ్నలు సంధించారు. వచ్చే ఆదివారం అక్కా బావెక్కడ అనే ప్రోగ్రాం లో ఆదికి ఫాన్స్ నుండి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఎదురయ్యాయి.

యాంకర్ రష్మీ మీ ఫాన్స్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగలనుకుంటున్నారు అని ఆదికి చెప్పింది. తర్వాత ఆది గారు మీరు కూడా సుధీర్ లాగే శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వెళ్ళిపోతారు అని ప్రచారం జరుగుతుంది. సుధీర్ అన్న లాగే మీరు ఇప్పటికే జబర్దస్త్ లో మానేశారు. ఈ ప్రచారం నిజమేనా అని అడిగాడు. దానికి ఆది ఏదో సమాధానం చెప్పినట్లుగా హైడ్ చేసి చూపించారు. అలాగే రోహిణి అక్కా ముందు బావెక్కడా అని రష్మిని సుధీర్ ని ఉద్దేశించి అడగగా.. దానికి రష్మీ కూడా కాస్త ఫైర్ అయినట్లుగా ప్రోమో లో చూపించారు. మరి హైపర్ ఆది ఆ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకి ఎలాంటి జవాబిచ్చాడో అనే ఆత్రుత, ఆసక్తి బుల్లితెర ప్రేక్షకుల్లో మొదలయ్యింది. మరి ఈ సస్పెన్స్ సండే వరకు కొనసాగడం ఖాయం.

Sridevi Drama Company latest promo viral:

Akka Bavekkada: Sridevi Drama Company Latest Promo

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ