Advertisementt

థాంక్యూ: స్వేచ్ఛగా వదిలేసే ప్రేమ గొప్పది

Tue 12th Jul 2022 07:30 PM
thank you movie,thank you movie trailer,naga chaitanya,raashi khanna,dil raju,avika gor,malavika nair  థాంక్యూ: స్వేచ్ఛగా వదిలేసే ప్రేమ గొప్పది
Thank You Movie Trailer released థాంక్యూ: స్వేచ్ఛగా వదిలేసే ప్రేమ గొప్పది
Advertisement
Ads by CJ

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ నటించారు. థాంక్యూ ట్రైలర్ లోకి వెళితే.. నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా, లవర్ బాయ్ గా, బిజినెస్ మ్యాన్ గా లుక్ విషయంలో చాలా వేరియేషన్ చూపించాడు. మాళవిక నాయర్ తో స్కూల్ లవ్, రాశి ఖన్నా తో మెచ్యూర్డ్ లవ్ అంటూ చైతూ స్టైలిష్ గా కనిపించాడు. మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువుండదు అని నా ఫ్రెండ్ చెప్పాడు, ఫ్లైట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పుడంతా నారాయణ పురం, నాకు మంచు అన్నా రంగులా రాట్నం అన్నా బాగా ఇష్టం, ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమకంటే స్వేచ్ఛగా వదిలెయ్యగలిగే ప్రేమ ఎంతో గొప్పది అని నాగ చైతన్య చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 

అవికా గోర్ రాఖి తెచ్చి చైతు చేతికి కట్టి, ఇప్పుడు నా అన్నవి, నేను ఏది చెబితే అది చెయ్యాలి అని ఆమె అనగా.. రాఖి కట్టాక చెయ్యంతా అంటూ చైతు ఎమోషనల్ గా చేసిన ఫైట్, అలాగే చైతు హాకీ గేమ్ ఆడినప్పటి  లుక్స్, మాళవిక సింపుల్ లుక్స్, రాశి ఖన్నా గ్లామర్ లుక్, థమన్ బీజీఎమ్, సినిమాటోగ్రఫీ అన్నీ ఆహ్లాదంగా అనిపించాయి. మనం తర్వాత చైతు - విక్రమ్ కుమార్ కాంబో రిపీట్ అవడంతో థాంక్యుపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది.

థాంక్యూ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Thank You Movie Trailer released :

Thank You Movie Trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ