Advertisementt

సినిమా పోయినా.. పొగరు తగ్గలేదు

Sat 09th Jul 2022 01:16 PM
kangana ranaut,dhaakad,negative pr,,jugjugg jeeyo,83  సినిమా పోయినా.. పొగరు తగ్గలేదు
Kangana Ranaut claims Dhaakad is victim of negative PR సినిమా పోయినా.. పొగరు తగ్గలేదు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ పొగరుగానే మాట్లాడుతుంది. స్టార్ హీరోలయినా తన కాలికిందే అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. బాలీవుడ్ ప్రముఖులని చులకనగా చూసే కంగనా రనౌత్ తన సినిమాలకు తానే కర్త కర్మ క్రియ అన్నట్టుగా ఉంటుంది. ఈమధ్యన కంగనా రనౌత్ నటించిన ధాకడ్ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ సినిమాకి దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెడితే చివరికి నిర్మాతకు నాలుగు కోట్లు కూడా రాలేదు. అంతలాంటి టాక్ తో ధాకడ్ సినిమా ప్లాప్ ని మూటగట్టుకుంది. ఆ సినిమా దెబ్బకి నిర్మాత ఆస్తులు అమ్ముకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 

అయితే కంగనా తన సినిమాపై సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేఖత మరే సినిమాకి రాలేదు అని, కావాలనే అలా తన సినిమాకి నెగిటివిటీని స్ప్రెడ్ చేసారని, ధాకడ్ సినిమా చేసి ఆమె నిర్మాత నష్టపోలేదు, ఆ సినిమా వలన ఆయనేం ఆస్తులు అమ్ముకోలేదు, ఆ సినిమా ఫలితం పట్ల మా నిర్మాత హ్యాపీ గానే ఉన్నారు, ధాకడ్ మీద వచ్చిన వ్యతిరేఖత మూలంగానే ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఇపప్టికి ఉదయం లేవగానే న్యూస్ చూస్తే ధాకడ్ పరాజయంపై న్యూస్ లు వస్తూనే ఉన్నాయి, మా సినిమాపై అంత నెగెటివిటి చూపించే సోషల్ మీడియా, గంగూభాయ్ కతీయవాడి, జగ్ జుగ్ జియో, 83 సినిమాలు ప్లాప్ అయినప్పుడు వాటిపై, ఆ హీరో-హీరోయిన్స్ పై ఎందుకు నెగెటివ్ వార్తలు రాయరు. కేవలం చిల్లర వ్యక్తులు మాత్రమే నా సినిమాపై నెగిటివిటి స్ప్రెడ్ చేస్తారంటూ రెచ్చిపోయింది.

Kangana Ranaut claims Dhaakad is victim of negative PR:

Kangana Ranaut claims Dhaakad is a victim of negative PR, asks why people aren't calling JugJugg Jeeyo and 83

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ