Advertisementt

చిరుకు రవితేజ సపోర్ట్ చేయడం లేదా?

Tue 12th Jul 2022 01:37 PM
ravi teja,chiranjeevi,ks ravindra,mega star,bobby,walter veeraiah,tollywood,chiranjeevi and raviteja,supporting role  చిరుకు రవితేజ సపోర్ట్ చేయడం లేదా?
No Raviteja in Chiru and Bobby Combo Film చిరుకు రవితేజ సపోర్ట్ చేయడం లేదా?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, రవితేజల సోదర బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరిలో ఉన్న కామన్ లక్షణం.. వీరిద్దరూ కృషితో స్టార్స్‌గా మారారు. పలు సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవే స్పూర్తి అంటూ రవితేజ స్వయంగా వెల్లడించారు కూడా. ‘అన్నయ్య’ చిత్రంలో చిరు సోదరుడిగా రవితేజ నటించారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ పాత్ర కోసం దాదాపు రవితేజ కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ పాత్రకి మరో హీరోని దర్శకుడు వెతికే పనిలో ఉన్నాడంటూ తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. 

 

విషయంలోకి వస్తే.. డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చిరంజీవికి సపోర్ట్‌గా ఉండే పాత్రలో రవితేజను మొదట బాబీ సంప్రదించగా.. అందుకు రవితేజ కూడా ఓకే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం రవితేజ ఉన్న బిజీ కారణంగా.. ఈ సినిమాలో నటించేందుకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఉండటంతో.. సింపుల్‌గా ఈ సినిమా విషయంలో చిరుకి సపోర్ట్ చేసే బాధ్యతల నుండి రవితేజ తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పాత్ర కోసం బాబీ మరో హీరోని వెతికే పనిలో ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఒకరిద్దరు యంగ్ హీరోలను ఆయన సంప్రదించినట్లుగా టాక్ నడుస్తుంది. ఫైనల్‌గా చిరుకి సపోర్ట్ చేసే పాత్ర ఎవరు చేయబోతున్నారనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. 

 

ఇక మెగాస్టార్ చిత్రాల విషయానికి వస్తే.. యంగ్ హీరోల కంటే కూడా స్పీడ్‌గా ఆయన తన చిత్రాలను కంప్లీట్ చేస్తూ.. రిలీజ్ డేట్స్‌లను లాక్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు పండుగలకు మూడు చిత్రాలను విడుదల చేసేలా.. ఆయన తన టీమ్స్‌లో హుషారు నింపుతున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే.. రాబోయే ప్రతి పండక్కి.. మెగాస్టార్ సినిమా ఉండటం ఖాయం అనేలా.. చిరు చిత్రాల వరుస ఉంది. 

No Raviteja in Chiru and Bobby Combo Film:

Ravi Teja says No To Mega Star Chiranjeevi

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ