Advertisementt

సాయి పల్లవికి మరో అద్భుతమైన పాత్ర

Thu 07th Jul 2022 09:30 PM
sai pallavi,gargi movie,gargi trailer review  సాయి పల్లవికి మరో అద్భుతమైన పాత్ర
Gargi trailer review సాయి పల్లవికి మరో అద్భుతమైన పాత్ర
Advertisement
Ads by CJ

సాయి పల్లవి నిన్నగాక మొన్న విరాట పర్వం మూవీ లో వెన్నెల పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ సినిమాలో వెన్నెల గా సాయి పల్లవి నక్సలైట్ ని ప్రేమించి.. ప్రేమ కోసం నక్సలైట్ గా మారి, అదే ప్రేమ కోసం తనువు చలించడం.. అన్నిటిలో ఆమె నటించలేదు, జీవించింది. ఇప్పుడు మరోసారి సాయి పల్లవికి అలాంటి పాత్ర తగిలింది. అదే గార్గి మూవీ, గార్గి లో సాయి పల్లవి మెయిన్ లీడ్ లో కనిపించబోతుంది. తాజాగా గార్గి నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్.

టీచర్ గా కనిపించిన సాయి పల్లవి తన తండ్రిని ఎందుకు అరెస్ట్ చేసారో తెలియక ఆయన్ని చూడడం, విడిపించుకోవడం కోసం చేసే పోరాటమే గార్గి మూవీ. నువ్వు రాత, విధి అన్నిటిని నమ్ముతావమ్మా.. కానీ నన్ను మాత్రం నమ్మవు. ఒక్కటి నేను మగపిల్లాడిని కాదు కదా.. ఆడపిల్లని కదా అంటూ సాయి పల్లవి తల్లితో చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. న్యాయవ్యవస్థకి, సాధారణ అమ్మాయి కి మధ్యన జరిగే సంఘర్షణే గార్గి లా కనిపిస్తుంది. ఎప్పటిలాగే సాయి పల్లవి చాలా నేచురల్ గా సింపుల్ గా ఆకట్టుకుంది. ఈ రోల్ సాయి పల్లవి కెరీర్ లో బెస్ట్ గా నిలిచిపోయేలా ఉంది.

Gargi trailer review:

Sai Pallavi Gargi trailer review

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ