దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సీతా రామం టీజర్‌తో మ్యాజికల్ కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి 1965 యుద్ధ నేపధ్యంలో ప్రేమకావ్యంగా తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎసెట్‌లో ఒకటిగా నిలుస్తుంది. మొదటి పాట ఓహ్ సీతా హే రామా సంగీత ప్రియులని అలరించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రెండో పాట- ఇంతందం ప్రోమోతో ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా లిరికల్ వీడియోను విడుదల చేశారు.
ఈ పాటలో దుల్కర్ సల్మాన్, మృణాల్ జోడి చూడముచ్చటగా వుంది. వారి కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. మృణాల్ ఠాకూర్ సాంప్రదాయ దుస్తులలో చాలా అందంగా కనిపించారు. ఆమె నృత్య ప్రదర్శన కూడా మనోహరంగా వుంది. ఈ సాంగ్ తో దుల్కర్ సల్మాన్ కి మరింత మంది ఫాన్స్ పెరగడం ఖాయం. అంత హ్యాండ్ సం గా కనిపించారు ఆయన. ఇంతందం సాంగ్ లిరిక్స్ మీ కోసం..
♫ఇంతందం దారి మళ్లిందా
భూమిపైకే చేరుకున్నాదా
లేకుంటే చెక్కి వుంటారా
అచ్చు నీలా శిల్ప సంపద
జగత్తు చూడని మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి తరించి తపస్సిలా
నిషీధులన్నీ తలొంచే తుషారానివా ♫
పాట పల్లవిలో వినిపించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. ఎస్పీ చరణ్ పాటని చాలా మధురంగా ఆలపించారు