Advertisementt

నాని దసరా పై రూమర్, ఖండించిన దర్శకుడు

Thu 30th Jun 2022 10:06 PM
dasara,nani,srikanth odela,keerty suresh  నాని దసరా పై రూమర్, ఖండించిన దర్శకుడు
Rumours on Dasara rubbished నాని దసరా పై రూమర్, ఖండించిన దర్శకుడు
Advertisement
Ads by CJ

నాని రీసెంట్ మూవీ అంటే సుందరానికి రిలీజ్ అయ్యింది.. సో సో కలెక్షన్లతో మేకర్స్ కి కష్టాలు తెచ్చిపెట్టింది. ఇక తర్వాత నాని కమర్షియల్ ఫార్మేట్ లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు. నాని దసరా లుక్ చూడగానే అందరికి అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ గుర్తుకు వచ్చేసింది. పక్కా మాస్ కేరెక్టర్ ని నాని చేస్తున్నాడు. సింగరేణి నేపథ్యంలో తెరకెక్కుతున్న దసరా మూవీ షూటింగ్ ఆగిపోయింది, కొన్ని సీన్స్ ని దర్శకుడు రీ షూట్ చేస్తున్నాడు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఓ నెటిజెన్ నాని దసరా షూటింగ్ బడ్జెట్ కారణంగా ఆగిపోయింది, అంతేకాదు.. స్క్రిప్ట్, యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి రీషూట్ జరుగుతోందని ట్వీట్ చేసాడు.

దానితో ఆ నెటిజెన్ కి దసరా దర్శకుడు శ్రీకాంత్ కూడా ఘాటైన రిప్లై ఇచ్చాడు. బ్రహ్మానందం కామెడీ చేస్తున్న ఓ జిఫ్ ఫైల్ ను షేర్ చేస్తూ.. ఈ సినిమా ఇప్పటికే 30% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.. అంటూ రిప్లై ఇచ్చి మరీ ఆ నెటిజెన్ దిమ్మతిరిగేలా చేసాడు. ఇక ఈ సినిమాలో నాని తో కీర్తి సురేష్ రెండోసారి రొమాన్స్ చేస్తుంది. ఈ సినిమా కోసం పదెకరాల్లో భారీ విలేజ్ సెట్ ను దాదాపుగా 12 కోట్ల పెట్టి నిర్మించారు కూడా.

Rumours on Dasara rubbished:

Dasara maker debunks all

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ