Advertisement
TDP Ads

రాజమౌళి రచ్చ ని కంటిన్యూ చేస్తున్న ఫాన్స్

Sat 25th Jun 2022 10:11 PM
malayalam,kaduva movie,rajamouli,rrr movie,vikranth rona,sita ramam,versatile stars,hyderabad  రాజమౌళి రచ్చ ని కంటిన్యూ చేస్తున్న ఫాన్స్
Versatile stars from Other languages are all set to visit Hyderabad రాజమౌళి రచ్చ ని కంటిన్యూ చేస్తున్న ఫాన్స్
Advertisement

రాజమౌళి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తో ఓ ట్రెండ్ సెట్ చేసారు. ముంబై, చెన్నై, కొచ్చి, బెంగుళూరు లలో ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్స్ పెట్టడమే కాదు, ఆయా భాషల్లో టాప్ హీరోలని ఆ ఈవెంట్స్ లో గెస్ట్ లుగా పిలవడంతో ఆయా హీరోల ఫాన్స్ ఆ ప్రెస్ మీట్స్ లో హంగామా చేసారు. అంతేకాకుండా ముంబై, చెన్నై, బెంగుళూరు ట్రిపుల్ ఆర్ ఈవెంట్స్ లో ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ ఫ్లకార్డులతో జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్ అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వాళ్ళ ఫాన్స్ చేసిన రచ్చ తోనే సినిమాపై సామాన్యులకి ఇంట్రెస్ట్ పెరిగింది.

ఇప్పుడు రాజమౌళి ట్రెండ్ ని చాలామంది హీరోలు ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పడు అన్ని భాషల సినిమాలు పాన్ ఇండియా లేవల్లోనే విడుదలవుతున్నాయి. మలయాళం నుండి పృథ్వీ రాజ్ కడువా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భషాల్లో రిలీజ్ చేస్తూ ఆయన తెలుగులో ప్రమోట్ చెయ్యడానికి హైదరాబాద్ వచ్చారు. ఓటిటి ప్రాచుర్యంలోకి వచ్చాక పృథ్వీ రాజ్ సుకుమారన్ తెలుగు వాళ్ళకి దగ్గరయ్యారు. అయ్యప్పన్ కోషియమ్, బ్రో డాడీ, లూసిఫర్, జన గణ మన సినిమాలతో మంచి ఫాలోయింగ్ వచ్చింది ఆయనికి. ఈరోజు కడువా ప్రెస్ మీట్ దగ్గర పృథ్వీ రాజ్ ఫాన్స్ కుడా హంగామా చేసారు. అంతేకాకుండా కన్నడ కిచ్చ సుదీప్ నటించిన విక్రాంత్ రోనా ట్రైలర్ లాంచ్ జరిగింది. దీనికి అఖిల్ గెస్ట్ గా వచ్చారు. ఆ ఈవెంట్ దగ్గర కూడా సుదీప్ ఫాన్స్ హడావిడి చెయ్యడం విశేషం.

ఇక మహానటి, కనులు కనులను  దోచాయంటే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయిన దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే జరిగింది. ఆ ఈవెంట్ దగ్గర కూడా దుల్కర్ ఫాన్స్ జై జైలు కొట్టడం చూస్తే రాజమౌళి స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ని ఇప్పుడు అన్ని భాషల హీరోలు వాళ్ళ ఫాన్స్ కూడా ఫాలో అయ్యిపోతున్నారనిపిస్తుంది. 

Versatile stars from Other languages are all set to visit Hyderabad:

The Biggest and Versatile stars from Other languages are all set to visit Hyderabad

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement