Advertisementt

బిగ్ బాస్ సీజన్ 6 పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Tue 21st Jun 2022 10:50 AM
bigg boss,bigg boss telugu 6,nagarjuna,bigg boss ott  బిగ్ బాస్ సీజన్ 6 పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting News on Bigg Boss 6 బిగ్ బాస్ సీజన్ 6 పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి ముగిసినప్పటి నుండే బిగ్ బాస్ సీజన్ 6 పై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. స్టార్ మా లో ప్రసారం అయ్యే సీజన్ 6 కి నాగార్జునే హోస్ట్ గా రాబోతున్నారు. ఈసారి సామాన్యులకి చోటు కలిపిస్తున్నట్టుగా నాగార్జున ప్రోమో వదిలారు. అలాగే బిగ్ బాస్ టైటిల్ లోగో అంటూ బిగ్ బాస్ ని అందరి నోళ్ళలో ఉండేలా చేస్తున్నారు. ఇక ఆగస్టు లో కానీ, సెప్టెంబర్ లో కానీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ ని మొదలు పెట్టె యోచనలో యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ ఎంపిక చేపట్టినట్టుగా తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్ పై అందరిలో ఆసక్తి, ఆత్రుత మొదలైంది. గ్లామర్ షో కోసం యాంకర్స్ ని, టివి ఆర్టిస్ట్ ని, అలాగే ఓ డాన్స్ మాస్టర్, ఇంకా ఓ సింగర్ కి చోటిచ్చే ఈ సీజన్ లో సామాన్యులుగా ఎవరు ఎంటర్ అవుతారో అనే క్యూరియాసిటీ మొదలయ్యింది. అయితే తాజాగా బయటికొచ్చిన సమాచారం ప్రకారం జబర్దస్త్ హైపర్ ఆది, యాంకర్ వర్షిణి, నవ్యా స్వామి, దీపిక పిల్లి, యాంకర్ ధన్షు, చిత్రారాయ్ లని ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ పేర్లు ఫైనల్ అనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తుంది. మరి ఫైనల్ గా ఎంతమంది అడుగుపెడతారో, ఎవరు వెళతారో అనేది తెలియాల్సి ఉంది. 

Interesting News on Bigg Boss 6:

Bigg Boss 6 update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ