Advertisementt

ప్రభాస్ సినిమా, మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Fri 17th Jun 2022 09:22 AM
maruti,prabhas,maruti interesting comments,prabhas - maruthi combo  ప్రభాస్ సినిమా, మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Maruti Interesting comments on Prabhas Movie ప్రభాస్ సినిమా, మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement
Ads by CJ

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరస కమిట్మెంట్స్ తో దూసుకుపోతున్నారు. గతంలో రెండుమూడేళ్ళకి ఓ సినిమా అన్నట్టుగా ఉండే ప్రభాస్ ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఆదిపురుష్ షూటింగ్ ముగించేసిన ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ మధ్యలో మారుతి తో ప్రభాస్ ఓ సినిమాకి కమిట్ అయ్యారనే న్యూస్ వచ్చేసింది. అయితే ప్రభాస్ మారుతికి సినిమా చేస్తానని మాటిచ్చినా ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు, స్క్రిప్ట్ ఓకె చెయ్యలేదు అనేది తాజాగా మారుతి మాటల ద్వారా అర్ధమైంది. ప్రస్తుతం పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో మారుతి ప్రభాస్ మూవీ పై కామెంట్స్ చెయ్యడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

ప్రభాస్‌‌ను కలిశా. ఆయనతో మాటలు నడుస్తున్నాయి. ప్రభాస్ తో ఓ మంచి సినిమా తీయాలి. డార్లింగ్, బుజ్జిగాడు లాంటి కేరెక్టర్స్ లో కనిపించిన యాక్టివ్ ప్రభాస్‌ను చూపించాలేనేది నా కోరిక. నేను ఆయన అభిమానిగా కలిశాను. ప్రభాస్‌తో సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు మళ్లీ చెబుతా. ప్రభాస్ ఫ్యాన్స్‌ను డిస్పాయింట్ చేయను.. ప్రభాస్ నేను గొప్ప అభిమానిని. ప్రభాస్ అట్యిట్యూడ్, పర్సనల్‌ గా ఆయనేంటో తెలుసు. ఆడియన్స్‌కు ప్రభాస్ నుంచి ఏం కావాలో అదే చూపిస్తాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్‌లో ఇవన్నీ జరుగుతాయి.. అంటూ ప్రభాస్ మూవీపై మారుతి ఇంట్రెస్టింగ్ గా స్పందించారు. 

Maruti Interesting comments on Prabhas Movie:

Prabhas - Maruthi Movie update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ