Advertisementt

విరాట పర్వం పై యంగ్ హీరో రివ్యూ

Sun 12th Jun 2022 08:32 PM
siddu jonnalagadda,rana,sai pallavi,virata parvam movie,virata parvam review  విరాట పర్వం పై యంగ్ హీరో రివ్యూ
Young Hero Review on Virata Parvam విరాట పర్వం పై యంగ్ హీరో రివ్యూ
Advertisement
Ads by CJ

రానా  - సాయి పల్లవి కలయికలో వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం మూవీ వచ్చే శుక్రవారం రిలీజ్ కాబోతుంది. కొన్ని కారణాలతో రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఎట్టకేలకు జూన్ 17 న ఫైనల్ గా థియేటర్స్ లోకి వస్తున్న విరాట పర్వం పై మంచి అంచనాలున్నాయి. రానా నక్సలైట్ గాను, సాయి పల్లవి విప్లవ భావాలతో నక్సలైట్స్ లోకి చేరి చేసిన పోరాటమే విరాట పర్వం కథ. సాయి పల్లవి లుక్స్, ఆమె పెరఫార్మెన్స్, రానా, ప్రియమణి అన్ని ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరులో టీం ఉంది. ఈ రోజు ఆదివారం వరంగల్ లో విరాట పర్వం ఆత్మీయ సభ జరుగుతుంది.

అయితే విరాట పర్వం ప్రివ్యూ చూసిన సెలబ్రిటీస్ విరాట పర్వం మూవీపై తన రివ్యూలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. టీజె టిల్లు తో అదరగొట్టిన సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ గా విరాట పర్వం మూవీ చూసేసినట్లుగా చెప్పడమే కాదు.. ఆ సినిమా ఎలా ఉందో తన రివ్యూ ఇచ్చేసాడు. నిన్న రాత్రి విరాట పర్వం సినిమాను చూసి మంత్రముగ్ధుడయ్యాను. రానా పెరఫార్మెన్సు, సాయిపల్లవి పెరఫార్మెన్సు కానీ.. గతంలో ఎన్నడూలేని విధంగా అదరగొట్టేసాడు. విరాట పర్వం ఒక చక్కటి కళాఖండం అంటూ సినిమాపై అంచనాలని ఓ రేంజ్ లో పెంచేసాడు సిద్దు జొన్నలగడ్డ. 

Young Hero Review on Virata Parvam:

Siddu Jonnalagadda Review on Virata Parvam

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ