Advertisement

NBK107: పవర్ ఫుల్ టీజర్ కి టైం ఫిక్స్

Thu 09th Jun 2022 09:17 AM
nbk107,balakrishna,gopichand malineni,balakrishna birthday,balayya birthday  NBK107: పవర్ ఫుల్ టీజర్ కి టైం ఫిక్స్
NBK107 first hunt(teaser) update out NBK107: పవర్ ఫుల్ టీజర్ కి టైం ఫిక్స్
Advertisement

బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10 న కావడంతో ఆయన చేస్తున్న కొత్త సినిమాల మేకర్స్ బాలయ్య కి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చేందుకు తహతహలాడుతున్నారు. నందమూరి ఫాన్స్ ని బాలయ్య సినిమా అప్ డేట్స్ తో ఖుషి చేసేందుకు రెడీ అవుతున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో (వర్కింగ్ టైటిల్) NBK107 లో నటిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK107లో బాలకృష్ణ ఫస్ట్ లుక్ తోనే అందరికి నచ్చేసారు. ఇక పుట్టిన రోజునాడు సింహం వేటకు రెడీ అంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఈ రోజు ఉదయమే NBK107 టీజర్ కి ముహూర్తం పెట్టి టైం ఫిక్స్ చేసింది టీం. NBK107 నుండి పవర్ ఫుల్ టీజర్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు. 

ఈ రోజు గురువారం సాయంత్రం 6:11గంటలకు అంటే బాలయ్య బర్త్ డే కి కొద్దిగంటల ముందే టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు టీజర్ రిలీజ్ పోస్టర్ లో పవర్-ప్యాక్డ్ మాస్ బొనాంజా లోడ్ అవుతుందని చూపించారు. ఇంకా ఆ పోస్టర్ లో పులిచెర్ల గ్రామం దూరం 4 కిమీలు అని చూపించే మైలురాయి బోర్డు దాని మీద రక్తం మరకలు అలాగే బాలకృష్ణ పట్టుకునే ఆయుధం అన్ని ఆ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. మరా పోస్టర్ లో బాలయ్య ని ఊర మాస్ గా ఊహించేసుకుంటున్నారు ఫాన్స్. ఇక 30 సెకన్ల టీజర్ లో దర్శకుడు బాలయ్య యాక్షన్ ని పర్ఫెక్ట్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. 

NBK107 first hunt(teaser) update out:

NBK107 powerful first hunt arriving

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement