Advertisementt

ప్రశాంత్ నీల్ Bday: ప్రభాస్-యశ్ స్పెషల్

Sat 04th Jun 2022 10:32 AM
prabhas,yash,prashanth neel birthday special,kgf 2,salaar,prashanth neel  ప్రశాంత్ నీల్ Bday: ప్రభాస్-యశ్ స్పెషల్
Prabhas, Yash celebrate Prashant Neel birthday ప్రశాంత్ నీల్ Bday: ప్రభాస్-యశ్ స్పెషల్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా నెంబర్ వన్ రాజమౌళి పేరుతొ పోటీ పడుతున్న పేరు. కెజిఎఫ్ చాప్టర్ 1 అండ్ 2 తోనే ప్రపంచ వ్యాప్తంగా కన్నడ పరిశ్రమని గుర్తించేలా చేసిన ప్రశాంత్ నీల్ కి మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు స్టార్ హీరోలు సైతం పొగిడేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి 1200 కోట్లని కొల్లగొట్టి ఇండియన్ బాక్సాఫీసు దగ్గర చరిత్ర సృష్టించింది, ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ బర్త్ డే నేడు. జూన్ 4th. ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా కెజిఎఫ్, సలార్ నిర్మాతలు గతరాత్రి బెంగుళూర్ లో అదిరిపోయే పార్టీ అరేంజ్ చేసారు.

ఆ పార్టీలో ప్రశాంత్ నీల్ బర్త్ డే తో పాటుగా కేజేఎఫ్ 50 డేస్ సెలెబ్రేషన్స్ కేక్ కటింగ్ కూడా జరిగింది. ఇక ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో సలార్ హీరో ప్రభాస్, కెజిఎఫ్ స్టార్ యశ్ పాల్గొని ప్రశాంత్ కి కేక్ తినిపించడం హైలెట్ అయ్యింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్-యశ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి మాస్ ఫాన్స్, యశ్ ఫాన్స్, ప్రభాస్ ఫాన్స్ ఊగిపోతున్నారు. ఇద్దరు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ డైనమైట్స్ తో షో మ్యాన్ ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకల కోసం ఒకేచోట చేరారు. ఈ వేడుకల కోసం ప్రభాస్ హైదరాబాద్ నుంచి బెంగళూర్ కు రావడంతో మరింత ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభాస్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు హోంబ్లే నిర్మాతలు.

Prabhas, Yash celebrate Prashant Neel birthday:

Prabhas, Yash explode like dynamites

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ