హరి హర వీరమల్లుకి అంతే బ్యాలెన్స్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో కొద్దిగా బిజీగా కనిపిస్తున్నారు. బిజెపి తో పొత్తు, టిడిపితో పొత్తు ఉంటుందో లేదో.. ఇలా ఆయన రాజకీయాలు ఆయన చేస్తున్నారు. మరోపక్క ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు కాస్త కంగారు పడుతున్నా రాబోయే లాభాల కోసం దానిని బయటపెట్టకుండా మ్యానేజ్ చేస్తున్నారు. పవన్ టైం ఉన్నప్పుడు షూటింగ్స్ కి హాజరవుతున్నారు. అలా మూడేళ్ళలో రెండు సినిమాలు చేసి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు నిర్మాతలకి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న హరి హర వీరమల్లు పై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రషెస్ పై, క్రిష్ దర్శకత్వం పై అసంతృప్తిగా ఉన్నారని, అందుకే మే లో జరగాల్సిన ఓ షెడ్యూల్ ని స్కిప్ చేసారని, పవన్ కోసం క్రిష్ వెయిటింగ్ అంటూ వార్తలొస్తున్నాయి. మరోపక్క ఒక్క 70 రోజుల షూటింగ్ చేస్తే హరి హర వీరమల్లు పూర్తవుతుంది అంటున్నారు. మరి జూన్ లో హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలు పెట్టి యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తారని అంటున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సెట్స్ లోకి అడుగుపెట్టేవరకు అనుమానమే అంటున్నారు చూద్దాం ఏం జరగనుందో అనేది..
Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Update
Hari Hara Veera Mallu Movie Update








































