Advertisementt

రామ్ ది వారియర్ షూటింగ్ ఫినిష్

Sat 28th May 2022 05:10 PM
ram pothineni,the warriorr,the warriorr shooting wrapped up,n linguswamy.  రామ్ ది వారియర్ షూటింగ్ ఫినిష్
The Warriorr Shooting Wrapped Up రామ్ ది వారియర్ షూటింగ్ ఫినిష్
Advertisement
Ads by CJ

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో హీరో రామ్ పోతినేని కనిపించనున్న సినిమా ది వారియర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 

ఆల్రెడీ విడుదలైన టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో ఉందని చెబుతున్నారంతా. ఈ రోజుతో సినిమా చిత్రీకరణ పూర్తయింది. గత వారం రోజులుగా  హీరో రామ్‌పై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేసారని, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కిచారు. దీంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు మొదలు పెట్టినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.

The Warriorr Shooting Wrapped Up:

Ram Pothineni Starrer The Warriorr Shooting Wrapped Up

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ