Advertisement

ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ.. పోలీస్ లాఠీఛార్జ్

Fri 20th May 2022 10:19 AM
jr ntr,tarak,ntr birthday,ntr fans,ntr house  ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ.. పోలీస్ లాఠీఛార్జ్
Jr NTR Fans Hungama at NTR House Midnight ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ.. పోలీస్ లాఠీఛార్జ్
Advertisement

ఈ రోజు మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగ రోజు. ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఆయనకు బ్యానెర్లు, కటౌట్స్ కట్టడం, పాలాభిషేకాలు అలాగే ఎన్టీఆర్ కోసం కేక్ కట్ చేస్తూ ఆయనకి విషెస్ చెబుతూ ఫాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు, కానీ రెండుళ్లుగా ఎన్టీఆర్ బర్త్ డే కరోనా పాండమిక్ లాక్ డౌన్ లో వెళ్లిపోవడంతో ఫాన్స్ ఆ రోజుని బాగా మిస్ అయ్యారు. కానీ ఈ ఏడాది అలా కాదు, ధూమ్ ధామ్ గా ఎన్టీఆర్ బర్త్ డేని ప్లాన్ చేసారు. ఇటు ఎన్టీఆర్ కూడా బర్త్ డే రోజు ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తూ కొత్త సినిమాల అప్ డేట్స్ వదులుతున్నారు.

ఇక ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజునాడు సోషల్ మీడియాలో ఆయనకి సెలబ్రిటీస్ నుండి బర్త్ డే విషెస్ అందడమే కాదు ఆయన ఫాన్స్ ఎన్టీఆర్ ఇంటి దగ్గరకి భారీగా చేరుకొని అక్కడ ఎన్టీఆర్ ని విష్ చేస్తూ కేక్ కట్ చేసే ప్రోగ్రాం పెట్టారు. ఎన్టీఆర్ ఇంటి గేట్ ముందు కేక్‌ కట్‌ చేసే సమయంలో అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఫ్యాన్స్ గొడవ శ్రుతి మించడంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఫాన్స్ మధ్యన గొడవ పెద్దది కావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు. అయితే అర్థరాత్రి నుండే ఎన్టీఆర్ ఫాన్స్ కొందరు ఎన్టీఆర్ ఇంటివద్దకు చేరుకొని బాణాసంచ కాల్చి హడావుడి చేశారు. ట్రిపుల్ ఆర్ తో మాసివ్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ మాస్ హీరో, మాస్ ఫ్యాన్స్, మాస్ సెలబ్రేషన్స్ అంటూ.. వారు అక్కడ చేసిన హడావిడి మాములుగా లేదు. 

Jr NTR Fans Hungama at NTR House Midnight:

JR. NTR: Tarak’s birthday today .. midnight commotion at NTR house .. police baton charge

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement