ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kangana Ranaut Says No Bollywood Star Deserves

నా ఇంటికి వచ్చే అర్హత ఎవరికీ లేదు: కంగనా

బాలీవుడ్ లో రెబల్ గా కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. బాలీవుడ్ నేపోటిజం పై ఫైట్ చేసే కంగనా ఏ స్టార్ హీరోని లెక్క చెయ్యదు. బాలీవుడ్ బడా సెలెబ్రెటీస్ కి ఎదురెళ్లి మరీ కొట్లాడుతుంది. నాతో కలిసి నటించడానికి ఏ స్టార్ కూడా సాహసించరు అని చెబుతుంది కంగనా. ఈ మధ్యన సౌత్ హీరోలు సూపర్బ్ అని, బాలీవుడ్ స్టార్ కిడ్స్ బాయిలర్ కోళ్లు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇక తాజాగా తన ఇంటికి ఏ బాలీవుడ్ స్టార్ కు గానీ, ఏ సెలబ్రిటీకి కానీ వచ్చే అర్హత లేదని కంగన రనౌత్ తీవ్రంగా స్పందించింది.

అంతేకాకుండా బాలీవుడ్ సెలబ్రిటీస్ తనను ఎవరైనా బయట కలిస్తే పర్వాలేదని, కానీ ఏ బాలీవుడ్ సెలెబ్రిటీని తన ఇంటికి ఆహ్వానించనని చెప్పింది. కంగనా నటించిన ధాకడ్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ధాకడ్ లో కంగనా ఏ హీరోకి తీసిపోని విధంగా యాక్షన్ సీక్వెన్స్ లో నటించింది అని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.

Kangana Ranaut says no Bollywood star deserves to visit her house

Kangana Ranaut Says No Bollywood Star Deserves
kangana ranaut
bollywood star
bollywood celebrities
dhakad movie