ప్రభాస్ ప్రాజెక్ట్ కె నుండి అదిరిపోయే అప్ డేట్

Tue 17th May 2022 12:26 PM
project k,nagashwin,prabhas,prabhas intro,deepika padukone,disha patani,amitab  ప్రభాస్ ప్రాజెక్ట్ కె నుండి అదిరిపోయే అప్ డేట్
Crazy update on Project K ప్రభాస్ ప్రాజెక్ట్ కె నుండి అదిరిపోయే అప్ డేట్
Advertisement
Ads by CJ

నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ హైదరాబాద్ లోని రామోపిజి ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనె తో పాటుగా దిశా పటాని కూడా నటిస్తుంది. ఈమధ్యనే ప్రాజెక్ట్ కే షూటింగ్ లోకి దిశా పటాని ఎంటర్ అయ్యింది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడంతో పాటుగా.. ఈ సినిమాకి ఎక్కువగా బాలీవుడ్ హంగులనే అద్దుతున్నారు నాగ్ అశ్విన్. ఇప్పటికే కీ రోల్ కోసం అమితాబచ్చన్ ని ఎంపిక చేసిన నాగ్ అశ్విన్.. ఇంకా సినిమాలోని కీలక నటులని కూడా బాలీవుడ్ నుండే తీసుకురాబోతున్నారట.

అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ప్రాజెక్ట్ కే నుండి ప్రభాస్ ఫాన్స్ కోసం నాగ్ అశ్విన్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. అది ప్రాజెక్ట్ కే ఓ షెడ్యూల్ పూర్తయ్యింది అని, ఆ షెడ్యూల్ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్స్ ఫినిష్ చేసినట్లుగా చెప్పారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ కే తదుపరి షెడ్యూల్ జూన్ నెలాఖరు నుండి మొదలు కాబోతున్నట్లుగా అప్ డేట్ ఇవ్వడంతో ప్రభాస్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

Crazy update on Project K:

Project K: NagAshwin revealed one schedule of the movie is completed including Prabhas intro

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ