Advertisementt

బుల్లితెర మీద అనిల్ రావిపూడి F3

Thu 12th May 2022 02:08 PM
f3,anil ravipudi,tamanna,mehreen akur,venkatesh,varun tej  బుల్లితెర మీద అనిల్ రావిపూడి F3
Anil Ravipudi F3 promotions on TV బుల్లితెర మీద అనిల్ రావిపూడి F3
Advertisement
Ads by CJ

మే 27 నవ్వుల ఫ్రాంచైసీ F3 రిలీజ్ కి రెడీ అయ్యింది. వెంకటేష్ - వరుణ్ తేజ్ కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన  F2 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా F3 ని తెరకెక్కించారు. వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్ ఇలా F2 నటులంతా F3 లో కంటిన్యూ అవుతుంటే.. ఇందులోకి గ్లామర్ హీరోయిన్ సోనాల్ చౌహన్ ఎంటర్ అయ్యింది. తాజాగా రిలీజ్ అయిన F3 ట్రైలర్ అంతా ఫన్ మరియు ఫ్రస్టేషన్. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ కి డబ్బు అంటే ఎంత వ్యామోహం ఉంటుందో కామెడీతో చూపించగా, డబ్బు వచ్చాక వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుందో ఫ్రస్టేషన్ తో చూపించారు అనిల్ రావిపూడి. ఇక వెంకీ రే చీకటి కామెడీ, వరుణ్ తేజ్ నత్తి తో ఫన్ జనరేట్ చేసారు. అయితే మే 27 న రిలీజ్ కాబోతున్న F3 ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి మాములు బిజీగా లేరు.

ఏకంగా బుల్లితెర మీదకొచ్చేసి వెరైటీగా ఫ్రస్టేషన్ తీర్చుకుంటూ F3 ప్రమోషన్స్ చేసేస్తున్నారు. ఈ శనివారం అనిల్ రావిపూడి, తమన్నా, సునీల్, సోనాల్ చౌహన్ లు సుమ పాపులర్ షో క్యాష్ షో కి గెస్ట్ లుగా వచ్చారు. అలాగే జీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటి గుట్టు సీరియల్ లో అనిల్ రావిపూడి తళుక్కుమన్నారు... మరి సినిమా రిలీజ్ అయ్యేలోపు అనిల్ రావిపూడి ఇంకెన్ని బుల్లితెర షోస్ లో కనిపిస్తారో చూద్దాం.

Anil Ravipudi F3 promotions on TV:

F3 promotions in full swing

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ