Advertisementt

సలార్ కోసం భారీగా సబ్ జైలు సెట్

Wed 11th May 2022 01:24 PM
prabhas,salaar update,prshanth neel,prabhas - prashanth neel combo,salaar movie,sruthi haasan  సలార్ కోసం భారీగా సబ్ జైలు సెట్
Prabhas Salaar update సలార్ కోసం భారీగా సబ్ జైలు సెట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ కొత్త షెడ్యూల్ ఈ నెలలోనే మొదలు కావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ మే మొదటి వారంలో సలార్ కొత్త షెడ్యూల్ మొదలవుతున్నట్టుగా కెజిఎఫ్ ప్రమోషన్స్ లో చెప్పారు. అలాగే ఈ నెల చివరి వారంలో సలార్ టీజర్ కూడా రాబోతున్నట్టుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. అయితే మే సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టినా సలార్ కొత్త షెడ్యూల్ మొదలయ్యింది అనే వార్త కానీ, టీజర్ అప్ డేట్ కానీ లేకపోయేసరికి ప్రభాస్ ఫాన్స్ కంగారు పడుతున్నారు. అయితే లేటెస్ట్ గా సలార్ పై తెలుస్తున్న అప్ డేట్ ఏమిటి అంటే..

ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె షూటింగ్ లో ఉన్నారు. ఈమధ్యనే ఈ ప్రాజెక్ట్ కె సెట్స్ లోకి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఎంటర్ అయ్యింది. సో ఈ షెడ్యూల్ ముగిసాక ప్రభాస్ రెండుమూడు రోజుల గ్యాప్ తో సలార్ సెట్స్ లోకి జాయిన్ అవుతారని.. ఈలోపు ప్రశాంత్ నీల్ హైదరాబాద్ లోనే ఉండి.. రామోజీ ఫిలిం సిటీలో భారీ బడ్జెట్ తో ఓ భారీ సబ్ జైలు సెట్‌ను వేస్తున్నారట. ఈ సెట్ సెటప్ అంతా అదిరిపోయిందని తెలుస్తోంది. ఈ జైలు సెట్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ చేపట్టనున్నారట.  ప్రశాంత్ నీల్, ప్రభాస్ క్రేజ్ కి, రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా సలార్ ని భారీ స్థాయిలోనే ప్లానింగ్ చేసినట్టు కనిపిస్తోంది.

Prabhas Salaar update:

Prabhas - Prashanth neel Salaar update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ