Advertisementt

రాజమౌళి తో సినిమా చెయ్యనంటున్న హీరో

Wed 04th May 2022 08:59 PM
chiranjeevi,rajamouli,rrr,ram charan  రాజమౌళి తో సినిమా చెయ్యనంటున్న హీరో
Star hero who wants to do a movie with Rajamouli రాజమౌళి తో సినిమా చెయ్యనంటున్న హీరో
Advertisement
Ads by CJ

రాజమౌళి తో సినిమా చెయ్యాలనే కోరిక, ఆత్రుత, ఉత్సాహం ఏ హీరోకైనా ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి అంటే సక్సెస్ కి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు అయితే ప్రస్తుతం పాన్ ఇండియా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అది రాజమౌళి చలవే కదా. కానీ ఇప్పుడో సీనియర్ స్టార్ హీరో రాజమౌళి తో సినిమా చెయ్యనని ఖరా ఖండిగా చెబుతున్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఈమధ్యన రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి సినిమా అంటూ ప్రచారం జరగడమే కాదు, ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి చిరు సినిమాని అనౌన్స్ చెయ్యబోతున్నారంటూ జోరుగా హుషారుగా ప్రచారం కూడా జరిగింది. కానీ అదేం నిజం కాలేదు.

తాజాగా మెగాస్టార్ రాజమౌళి తో తాను సినిమా చేయడం లేదు అని, ఇకపై చెయ్యబోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. నాకు రాజమౌళి తో సినిమా చెయ్యాలనే కోరిక లేదు, నాకు ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినా చెయ్యను. కారణం ఏమిటంటే.. నేను ఆక్టర్ గా రాజమౌళిని ఎలా సంతృప్తి పరుచాలో నాకు తెలియదు. రాజమౌళి ని మెప్పించడం నాకు కష్టమే అనిపిస్తుంది.. అందుకే ఆయనతో సినిమా చేయను అనేసారు చిరు. 

మరి నిజంగానే రాజమౌళి తో సినిమా అంటే అలాంటి ఇలాంటి కష్టం ఉండదు. అర్ధరాత్రి కూడా హీరోలు ఆయనతో పని చెయ్యాల్సిందే. ఇవన్నీ చరణ్ విషయంలో చూసిన చిరు రాజమౌళి తో సినిమా చెయ్యను అంటున్నారేమో.

Star hero who wants to do a movie with Rajamouli:

Chiru about rajamouli movie

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ