హరి హర వీరమల్లు పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

పవన్ కళ్యాణ్ రెండ్రోజులు పాలిటిక్స్, రెండ్రోజులు షూటింగ్ అంటూ చాలా బిజీగా వుంటున్నారు. క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు సెట్స్ లో పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటున్నారు. అలసిపోయి షూటింగ్ స్పాట్ లోనే పవన్ కళ్యాణ్ నులక మంచం మీద నిద్రిస్తున్న పిక్ ఈమధ్యనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే హరి హర వీరమల్లు ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని.. ఇప్పుడు మరో షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసింది.

ఆ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ - విలన్ అర్జున్ రామ్ పాల్ పై యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ కి వెళ్లేముందు కొన్నిరోజులు యుద్ధ కళలు నేర్చుకుని మరీ రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ మే 2 నుండి హైదరాబాద్ లోనే మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో హరి హర వీరమల్లు లోని కీలక నటులు అంతా పాల్గొంటారని, ఈ షెడ్యూల్ ఓ 15 రోజుల పాటు సాగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫెతి ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. 

Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Update

Hari Hara Veera Mallu Movie Update
pawan kalyan
hari hara veera mallu
krish
pawan kalyan hari hara veera mallu movie
hari hara veera mallu movie update