ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishwak Sen about his Breakup love story

విశ్వక్ బ్రేకప్ లవ్ స్టోరీ

విశ్వక్ సేన్ నటించిన ఫలక్ నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది కాస్త పర్వాలేదనిపించాయి. హిట్ మూవీ హిట్ అయ్యింది. కానీ తర్వాత పాగల్ లాంటి డిజాస్టర్ మూవీ చేసాడు. ఇక ఇప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణం తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో పెళ్లి కోసం ఎదురు చూసే 30 ఏళ్ళ అబ్బాయిలా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది అశోకవనంలో అర్జున కళ్యాణం టీం. ప్రమోషన్స్ లో భాగంగా ఓ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ వీడియో లో విశ్వక్ సేన్ బ్రేకప్ లవ్ స్టోరీ బయటపెట్టాడు. సోషల్ మీడియాలో ఫాన్స్ చిట్ చాట్ వీడియో అది.

ఆ చిట్ చాట్ లో విశ్వక్ ని మీరు తీసిన ప్రతి సినిమాలో బ్రేకప్ లవ్ స్టోరీ ఉంటుంది. మీ రియల్ లైఫ్ లోను ఇలాంటి బ్రేకప్ స్టోరీ ఏమైనా ఉందా అని ఓ అమ్మాయి ప్రశ్నించింది. దానికి విశ్వక్ సేన్ రిప్లై ఇస్తూ ప్రతి ఒక్కరి లైఫ్ లోను ఏదో ఒక ట్రాజడీ జరుగుతుంది. మేము అదే సినిమాల్లో చూపిస్తాం. నా లైఫ్ లోను ఓ బ్రేకప్ లవ్ స్టోరీ ఉంది. నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమెతో మూడేళ్లు లవ్ లో ఉన్నాను. కానీ ఎందుకో తెలియదు. ఆమె నన్ను వదిలేసింది. ఆ విషయం కూడా నాకు నెల తర్వాతే తెలిసింది. ఈ విషయమై నేను అంతకు మించి చెప్పలేను. కానీ ఆ విషయంలో చాలా బాధపడ్డాను. అంటూ చెప్పిన విశ్వక్ సేన్ తాను చేసుకోబోయే అమ్మాయికి మాత్రం తన కన్నా ఎక్కువ తెలివితేటలు ఉండాలని కోరుకుంటున్నాడు.

Vishwak Sen about His Love Breakup

Vishwak Sen about his Breakup love story
vishwak sen
love breakup
ashokavanamlo arjuna kalyanam