Advertisementt

మొన్న మహేష్ నేడు సుదీప్

Mon 25th Apr 2022 01:05 PM
kiccha sudeep,bollywood,hindi,national language  మొన్న మహేష్ నేడు సుదీప్
Kiccha Sudeep sensational comments on Bollywood మొన్న మహేష్ నేడు సుదీప్
Advertisement
Ads by CJ

ఆదివారం జరిగిన ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అంటే హిందీ వైపే చూసేవారు. ఇండియన్ బాక్సాఫీసు అంటే హిందీనే అనేవారు. కానీ ఇప్పుడు రాజమౌళి బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, సుకుమార్ పుష్ప, ప్రభాస్ రాధే శ్యామ్ లాంటి సినిమాలు పాన్ ఇండియాలో విడుదలై ఎల్లలు చెరిపేసింది అన్నారు మెగాస్టార్. అలాగే మహేష్ బాబు ని మీరు డైరెక్ట్ హిందీ మూవీ ఎప్పుడు చేస్తారు అంటే.. హిందీలో సినిమా చెయ్యాల్సిన పనేం ఉంది.. మన సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యి అక్కడ బాక్సాఫీసుని కుదిపేస్తున్నాయని, ఇలాంటి టైం లో మనం హిందీ మీద ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు అన్నారు.

తాజాగా కన్నడ హీరో కిచ్చ సుదీప్ కూడా బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చెయ్యడం ఇంట్రెస్టింగ్ గా మారింది. సుదీప్ ఓ ప్రెస్ మీట్ లో మట్లాడుతూ.. 

ఒక కన్నడ మూవీని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించారని అంటున్నారు.. ఇక్కడ ఓ చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా.. ఇప్పుడు హిందీ ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను తెరకెక్కస్తున్నారు. వాటిని తెలుగు, తమిల్ ఇతర భాషల్లో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి సక్సెస్ అవుతున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు సౌత్ లో మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి అంటూ హిందీ సినిమాలపై సుదీప్ సంచలన కామెంట్స్ చేసారు.

Kiccha Sudeep sensational comments on Bollywood:

Kiccha Sudeep Says Hindi Is No More A National Language

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ