Advertisementt

విజయ్-సమంత కాంబో మొదలు కాబోతుంది

Mon 18th Apr 2022 08:41 PM
vijay devarakonda,shiva nirvana,samantha,vijay devarakonda - samantha combo movie  విజయ్-సమంత కాంబో మొదలు కాబోతుంది
Vijay Devarakonda - Samantha movie update విజయ్-సమంత కాంబో మొదలు కాబోతుంది
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం లైగర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి పూరి జగన్నాథ్ తో జన గణ మన మొదలు పెట్టాడు. జన గణ మన మొదలు పెట్టిన రోజే వచ్చే ఏడాది ఆగష్టు లో సినిమా విడుదల అంటూ డేట్ ప్రకటించేసారు పూరి అండ్ విజయ్ లు. ఇక లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ ఒకటి శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చెయ్యాల్సిన కమిట్మెంట్ ఉంది. అలాగే సుక్కు తో పాన్ ఇండియా మూవీ కమిట్మెంట్ ఉంది. అయితే పూరి జన గణ మన మొదలు పెట్టడంతో అందరిలో అనుమానం మొదలయ్యింది. శివ నిర్వాణ మూవీ పక్కనబెట్టారేమో అని.

కానీ రీసెంట్ గానే శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కి జోడిగా సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అని, కాశ్మిర్ లో ఈ సినిమా మొదలు కాబోతుంది అన్నట్టుగానే.. ఈనెల అంటే ఏప్రిల్ 21 న శివ నిర్వాణ - విజయ్ - సమంతల మూవీ పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుందట, 23 నుండి కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ తో రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ సోల్జర్ గా కనిపించబోతున్నాడని, అటు పూరి జన గణ మనలోనూ విజయ్ సోల్జర్ గానే కనిపిస్తారని, సో రెండు సినిమాల లుక్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి.. రెండు సినిమాల షూటింగ్స్ పారలల్ గా చెయ్యడానికి విజయ్ రెడీ అవుతున్నారట.

Vijay Devarakonda - Samantha movie update:

Vijay Devarakonda - Shiva Nirvana - Samantha movie update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ