Advertisement

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన మిల్కి బ్యూటీ

Mon 11th Apr 2022 08:39 PM
tamanna,milky beauty,tamanna wedding,chiranjeevi,bhola shankar  పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన మిల్కి బ్యూటీ
Tamanna confirms her Marriage Rumours పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన మిల్కి బ్యూటీ
Advertisement

మిల్కి బ్యూటీ తమన్నా ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా వున్న సీనియర్ హీరోయిన్. గత ఏడాది సీటిమార్, మ్యాస్ట్రో  సినిమాల్లో నటించిన తమన్నా మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కి హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ఇక తెలుగు, బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న తమన్నాకి చిరు భోళా శంకర్ లో ఆఫర్ వచ్చింది. అయినా సీనియర్ హీరోలకి ఫిక్స్ అవుతున్న తమన్నా కెరీర్ చివరి దశలో ఉంది.. సో పెళ్ళికి తమన్నా సిద్దమవుతుంది అనే టాక్ మొదలయ్యింది. ఇప్పటికే తమన్నా ఫ్యామిలీ మెంబెర్స్ తమన్నాకి పెళ్లి కొడుకుని కూడా వెతికేసారంటూ వార్తలొస్తున్నాయి. 

తమన్నా తన పెళ్లిపై వస్తున్న వార్తలపై తాజాగా స్పందించింది. ప్రస్తుతానికి అయితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు, ఇంకా ఆ ఆలోచన లేదు. పెళ్లి చేసుకుంటా.. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే ఇంకా రెండేళ్లు వెయిట్‌ చేయాలి. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా అంటూ తమన్నా తన పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సో తమన్నా పెళ్లి చూడాలి అనుకుంటే మరో రెండేళ్లు వెయిట్ చెయ్యాల్సిందే మరి. 

Tamanna confirms her Marriage Rumours:

Tamanna is getting married soon .. Milky Beauty given by Clarity

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement