Advertisementt

తెలుగుపై గట్టి ఫోకస్ పెట్టిన కెజిఎఫ్2 టీం

Sun 10th Apr 2022 12:50 PM
andhra,telangana,kgf 2 team,kgf 2 movie,kgf 2 review,yash,prashanth neel  తెలుగుపై గట్టి ఫోకస్ పెట్టిన కెజిఎఫ్2 టీం
KGF2 team with a strong focus on Telugu తెలుగుపై గట్టి ఫోకస్ పెట్టిన కెజిఎఫ్2 టీం
Advertisement
Ads by CJ

ఇప్పుడు కెజిఎఫ్ టైం అంటూ టీం ప్రమోషన్స్ తో తెగ హడావిడి చేస్తుంది. బెంగుళూర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టిన మేకర్స్.. పలు రాష్ట్రాల ఫాన్స్ తో, మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకు వెళుతున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ఫీవర్ తగ్గి మాస్ ఆడియన్స్ కి కెజిఎఫ్ 2 ఫీవర్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడెప్పుడు యశ్ మాస్ కటౌట్ ని స్క్రీన్ మీద చూస్తామా.. కెజిఎఫ్ తో కలెక్షన్ కొల్లగొట్టిన యశ్ అండ్ ప్రశాంత్ నీల్ ఈసారి ఏం చూపిస్తారో అనే క్యూరియాసిటీ తో ఉన్నారు.

ఇక కెజిఎఫ్ కన్నడంలోనే కాదు, తెలుగు, తమిళ్, హిందీ మలయాళం అంటూ పాన్ ఇండియాలో విడుదల కాబోతుంది. హిందీ, తెలుగులో కెజిఎఫ్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. అలాగే ఇక్కడి మేకర్స్ కెజిఎఫ్ తెలుగు రైట్స్ ని కోట్లతో కొనుగోలు చేసారు. ఎందుకంటే ఆ సినిమా క్రేజ్ అలాంటిది. అందుకే టీం కూడా తెలుగు రాష్ట్రాలపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. అందులో భాగమగానే కెజిఎఫ్ 2 టీం తెలుగు రాష్ట్రాల్లో సినిమాని భారీగా ప్రమోట్ చెయ్యబోతున్నారు. తాజాగా రూట్ మ్యాప్ అంటూ ఏప్రిల్ 10 సాయంత్రం తిరుపతిలో కెజిఎఫ్ ప్రెస్ మీట్ పెట్టి.. ఆ నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ 11 న తిరుమల శ్రీవారాని దర్శించుకుంటారట టీం సభ్యులు. ఆ తర్వాత అదే రోజు నేరుగా వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి సింహాచల వెల్లబోతున్నారట.

సింహాచలం నుండి అదే రోజు ఉదయం వైజాగ్ వచ్చి అక్కడ కెజిఎఫ్ ప్రెస్ మీట్ ప్లాన్ చేసింది టీం. అలాగే ఏప్రిల్ 11 నే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి ఈవెనింగ్ అంటే 7 గంటలకి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాలని కెజిఎఫ్ టీం ఇలా కవర్ చేసి మాస్ ఆడియన్స్ లో ఊపు తేవాలని డిసైడ్ అయ్యారనిపిస్తుంది.. 

KGF2 team with a strong focus on Telugu:

Andhra - Telangana Route map of KGF 2 team arrival 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ