Advertisement

గాడ్ ఫాదర్ లో పాన్ ఇండియా డైరెక్టర్

Fri 08th Apr 2022 10:08 PM
puri jagannadh,chiranjeevi,godfather,mohan raja,salman khan,nayantara  గాడ్ ఫాదర్ లో పాన్ ఇండియా డైరెక్టర్
Godfather having Dashing Director special గాడ్ ఫాదర్ లో పాన్ ఇండియా డైరెక్టర్
Advertisement

మెగాస్టార్ చిరు - మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ పై రోజుకో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా చిన్నగా రీమేక్ గా మొదలై ఇప్పుడో బడా మల్టీస్టారర్ లా తయారైంది. చిరు - నయన్ బ్రదర్ అండ్ సిస్టర్ గా నటించడమే ఓ విశేషం అయితే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ బాడీ గార్డ్ గా నటించడం మరో బ్రేకింగ్. చిరంజీవి పొలిటికల్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ చిరు ఫ్లాష్ బ్యాక్ లో బాడీ గార్డ్ కేరెక్టర్ లో కనిపిస్తారట. ముంబై లో చిరు - సల్మాన్ ఖాన్ కాంబో సీన్స్ పూర్తయినట్లుగా అప్ డేట్ ఇచ్చారు. ఇక మెగాస్టార్ కి సల్మాన్ కి మధ్యన ఓ నాటు నాటు సాంగ్ కూడా ఉండబోతుంది అంటున్నారు. 

అదలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ఓ పాన్ ఇండియా డైరెక్టర్ కూడా నటించబోతున్నారట. ఆయనెవరో కాదు.. లైగర్ మూవీ తో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టబోతున్న పూరి జగన్నాధ్ చిరు గాడ్ ఫాదర్ లో ఓ క్యామియా రోల్ లో కనిపించబోతున్నారట. జస్ట్ ఓ సీన్ లో పూరి జగన్నాధ్ మెరవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక గాడ్ ఫాదర్ మూవీ ని ఈ ఏడాది ఆగష్టు 11 న విడుదల చేసేందుకు మేకర్స్ చూస్తున్నారని, త్వరలోనే గాడ్ ఫాదర్ డేట్ పై అఫీషియల్ ప్రకటన కూడా వస్తుంది అని సమాచారం.  

Godfather having Dashing Director special:

Puri Jagannadh cameo in Chiranjeevi Godfather 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement