ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> KGF 2 Promotions craze in social media

ఆర్ ఆర్ ఆర్ అంత ఊపు కనిపించడం లేదే..

KGF 2 Promotions craze in social media

ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడమే సోషల్ మీడియాని ఆక్యుపై చేసేసింది. అంతేకాకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి లు ఆడియన్స్ ని ఆలోచించడానికి టైం ఇవ్వకుండా ట్రిపుల్ ఆర్ ని జనాల్లోకి తీసుకువెళ్లారు. డిసెంబర్ లోనే ముంబై, చెన్నై, బెంగుళూరు, కొచ్చి, హైదరాబాద్ అంటూ నానా హడావిడి చేసారు. ఇక మార్చ్ లో ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో ఓ కొత్త ఒరవడి సృష్టించారు. దుబాయ్ వేదికగా ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ పెట్టి అందరి చూపు తిప్పుకునేలా చేసారు. ఇండియా వైడ్ గా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ గురించి సినిమా రిలీజ్ వరకు మట్లాడుకునేలా చేసింది టీం.

మరి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ని మించి పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న కెజిఎఫ్ 2 కూడా రీసెంట్ గానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. యశ్, ప్రశాంత్ నీల్, హీరోయిన్, బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లు స్పెషల్ ఫ్లైట్స్ వేసుకుని మరీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. కానీ సోషల్ మీడియాలో ట్రిపుల్ ఆర్ కి వచ్చిన హైప్ కెజిఎఫ్ 2 కి కనిపించడం లేదు. యశ్ ముంబై, బెంగుళూరు ప్రెస్ మీట్స్ లో పాల్గొంటున్నారు. అయితే కన్నడలో విపరీతమైన క్రేజ్ ఉన్న యశ్ కి ఇతర భాషల్లోనూ కెజిఎఫ్ తో క్రేజ్ వచ్చేసింది. కానీ ట్రిపుల్ ఆర్ కున్న మానియా, ఆ ఫీవర్ అయితే కెజిఎఫ్ 2 ఫాన్స్ లో కనిపించడం లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

RRR vs KGF 2

rrr movie
kgf 2
kgf 2 promotions
social emdia
rrr promotions
yash