తెలంగాణలో గని టికెట్ రేట్స్ తగ్గింపు

Mon 04th Apr 2022 02:26 PM
telangana,varun tej,ghani movie,ghani  తెలంగాణలో గని టికెట్ రేట్స్ తగ్గింపు
Reduced Ticket Prices in Telangana for Ghani తెలంగాణలో గని టికెట్ రేట్స్ తగ్గింపు
Advertisement
Ads by CJ

కరోనా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ కొన్ని తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. టికెట్ రేట్స్ తగ్గించడం ఒక సమస్య అయితే...  థియేటర్లలో షోలు తగ్గించడం మరో సమస్య! ఆర్ఆర్ఆర్ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని వెసులుబాటు ఇవ్వడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పోసుకుంది. ప్రతి ఏరియాలో రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఫీవర్ తగ్గుతోంది. ప్రతి వారం కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈ వారం విడుదల అవుతున్న చిత్రాల్లో వరుణ్ తేజ్ గనికి ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించారు.

తెలంగాణలో గని టికెట్ రేట్స్ తగ్గించాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో ₹200 + జీఎస్టీ, సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి ₹ 150 గా టికెట్ రేట్స్ డిసైడ్ చేశారు.

టికెట్ రేట్స్ తగ్గించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ గని సినిమాకు వెళ్ళాలని అనుకుంటున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన గని చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు బాబీ, సిద్దు ముద్దు నిర్మించారు. వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నరేష్, నవీన్ చంద్ర తదితరులు సినిమాలో నటించారు.

Reduced Ticket Prices in Telangana for Ghani:

Reduced Ticket Prices in Telangana for Varun Tej Ghani

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ