Advertisementt

గుడ్ న్యూస్ చెప్పబోతున్న రానా?

Fri 01st Apr 2022 09:35 AM
rana daggubati,miheeka bajaj,pregnancy,rana,nithin,nikhil  గుడ్ న్యూస్ చెప్పబోతున్న రానా?
Is Rana going to tell the good news? గుడ్ న్యూస్ చెప్పబోతున్న రానా?
Advertisement
Ads by CJ

సెలబ్రిటీస్ ఇళ్లల్లో ఏం జరిగినా అదో సెన్సేషన్ అవుతుంది. వారి ఇంట్లో పెళ్లయినా, చావయినా అది సాధారణ ప్రేక్షకులకి సంచలనమే. అందుకే ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తుంటారు. ఇక టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకులుగా ఉన్న రానా, నితిన్, నిఖిల్ లు లాక్ డౌన్ లో సైలెంట్ గా ఫ్యామిలీస్ మధ్యలోనే ఓ ఇంటి వారయ్యారు. దాదాపుగా ఈ ముగ్గురు హీరోలు అటు ఇటుగా ఒకే ఏడాది పెళ్లి పీటలెక్కారు. దగ్గుబాటి రానా తన ఫ్రెండ్, ప్రేయసి మెహిక ని 2020 లో వివాహం చేసుకున్నాడు. అది కూడా దగ్గుబాటి ఫ్యామిలీ కొద్ది మంది అతిధుల మధ్యన అంగరంగ వైభవంగా రానా పెళ్లి జరిగింది.

అయితే రీసెంట్ గా రానా తండ్రి కాబోతున్నాడని, మెహిక బజాజ్ ప్రెగ్నెంట్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎలా అంటే పెళ్లి తర్వాత చాలా రోజులకి దర్శనమిచ్చిన మెహిక కాస్త బొద్దుగా మారడంతో అందరిలో అనుమానాలు షురూ అయ్యాయి. మెహిక ప్రెగ్నెంట్ అయ్యుండొచ్చు అందుకే అలా బొద్దుగా తయారయ్యింది అని. అదే విషయాన్ని ఓ నెటిజెన్ నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది మేడం.. మీరు ప్రెగ్నెంటా అని ప్రశ్నించడంతో వెంటనే రియాక్ట్ అయిన మిహిక.. నో, నో అది మ్యారేజ్‌ వెయిట్‌ అని రిప్లై పెట్టింది. దానితో మెహిక ప్రెగ్నెంట్ కాదని తేలిపోయింది. రానా ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పడం లేదని తెలిసిపోయింది.

Is Rana going to tell the good news?:

Rana Daggubati Wife Miheeka Bajaj Clarifies on her Pregnancy Rumors 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ