Advertisement

రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ

Thu 31st Mar 2022 04:46 PM
ravi teja,nupur sanon,tiger nageswara rao,director vamshi,ravi teja - nupur sanon  రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ
Bollywood beauty opposite Ravi Teja రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ
Advertisement

రవితేజ వరస ప్రాజెక్ట్స్ తో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఖిలాడీ ఇలా విడుదలైందో లేదో.. అలా రామ రావు ఆన్ డ్యూటీని ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక తర్వాత ధమాకా మూవీ, రావణాసుర మూవీ షూటింగ్స్ ని పరిగెత్తిస్తున్న రవితేజ మెగాస్టార్ చిరు - బాబీ కాంబోలో తెరకెక్కుతున్న మెగా154 మూవీలో ఓ స్పెషల్ కేరెక్టర్ చేస్తున్నారు. ఇక మొదటిసారిగా రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అది కూడా టైగర్ నాగేశ్వరావు అంటూ రవితేజ పాన్ ఇండియా మూవీ ని ఎప్పుడో ప్రకటించారు. 

ఈ సినిమా ఉగాది స్పెషల్ గా అంటే ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది. ఉగాది రోజున మాదాపూర్ లోని నోవాటెల్ లో టైగర్ నాగేశ్వరరావు మూవీ యూనిట్ సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ ని కూడా విడుదల చేయనున్నారు. వంశీ డైరెక్షన్స్ లో తెరకెక్కనున్న టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ డ్రామాగా ఉండబోతుంది. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన దొంగ స్టువర్ట్పురం నాగేశ్వరరావు కథ. అక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

టైగర్ నాగేశ్వరరావు పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు రవితేజ పూర్తిగా తనను తాను చేంజ్ చేసుకోబోతున్నారు. అందుకు తగిన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.. ఈ సినిమాలో రవితేజ బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ తో రొమాన్స్ చెయ్యబోతున్నారు. ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ సిస్టర్ నుపూర్ రవితేజ మూవీ తో సౌత్ కి పరిచయం అవుతుంది. 

Bollywood beauty opposite Ravi Teja:

Ravi Teja Romance to Nupur Sanon from Tiger Nageswara Rao

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement