Advertisementt

షాకిస్తున్న గని బడ్జెట్

Sat 26th Mar 2022 10:36 PM
ghani movie,varun tej,allu bobby,allu aravind,kiran korrapati  షాకిస్తున్న గని బడ్జెట్
Shocking Ghani budget షాకిస్తున్న గని బడ్జెట్
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గని రిలీజ్ కి రెడీ అవుతుంది. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే రోజున గని రిలీజ్ కి ప్లాన్ చేసారు మేకర్స్. అల్లు బాబీ ఫస్ట్ టైం నిర్మిస్తున్న ఈ మూవీ ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసారు. గని మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. దాని కోసం వరుణ్ తేజ్ ఫుల్ గా మేకోవర్ అయ్యారు. బాక్సర్ గా చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీ ని పెంచాడు. అయితే ఇప్పుడు గని మూవీ కి అల్లు బాబీ భారీగా ఖర్చు పెట్టేశారట. అంటే ఆ ఖర్చులో చాలా వరకు వెస్ట్ గా పెట్టిన ఖర్చే ఎక్కువట. అంటే కరోనా టైం లో షూటింగ్ పోస్ట్ పోన్ అవడం, అలాగే ఫారిన్ నుండి స్పెషల్ గా బాక్సర్లు ని తెప్పించడం, వరుణ్ తేజ్ కి కాలికి యాక్సిడెంట్ అవడంతో కొద్దిరోజులు షూటింగ్ ఆపెయ్యడం వంటి విషయాలతో గని బడ్జెట్ తడిచి మోపెడు అయ్యిందట. 

అంతేకాకుండా గని మూవీ కి వేసిన స్పెషల్ సెట్స్ కి కూడా బాగా ఖర్చయ్యిందట. అటు అల్లు బాబీ ఫస్ట్ సినిమా కాబట్టి ఖర్చు విషయంలో వెనకాడకపోయినా.. వరుణ్ తేజ్ కి అంత స్టామినా ఉందా.. గని బడ్జెట్ ని వెనక్కి తేగల సత్తా ఉందా? అసలే విడుదలైన వారానికే కన్నడ నుండి పాన్ ఇండియా మూవీ గా కెజిఎఫ్ 2 మూవీ దూసుకువస్తుంది. అలాంటప్పుడు గని కి పెట్టి భారీ బడ్జెట్ 50 కోట్లు వెనక్కి వస్తాయా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

Shocking Ghani budget:

Shocking Varun tej Ghani budget

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ