డేట్ చేంజ్ అంటున్న రామ రావు

రవితేజ - శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ అసలైతే మార్చ్ 25 కానీ లేదంటే ఏప్రిల్ 1 కానీ రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ మార్చి 25 న ట్రిపుల్ ఆర్ రాకతో మాస్ రాజా రామ రావు ఆన్ డ్యూటీ డేట్ చేంజ్ అంటున్నారు.
రామారావు ఆన్ డ్యూటీ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు. రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
రిలీజ్ డేట్ తో పాటుగా రవితేజ తీక్షణంగా చూస్తోన్న లుక్ ని విడుదల చేశారు. ఇందులో కొన్ని భారీ రవాణా వాహనాలు అడవి గుండా వెళుతుండడాన్ని రవితేజ గమనిస్తున్నాడు. ఈ పోస్టర్ ఆసక్తిని క్రియేట్ చేయడమేకాకుండా, సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రవితేజ దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ తో రొమాన్స్ చేస్తుండగా.. చాలా రోజుల తర్వాత వేణు తొట్టెంపూడి రామ రావు ఆన్ డ్యూటీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Ramarao On Duty Releasing On June 17th
Ramarao On Duty Releasing On







































